Posted [relativedate]
కమర్షియల్ సినిమాలను తీయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న గుణశేఖర్ లాస్ట్ ఇయర్ తీసిన హిస్టారికల్ మూవీ రుద్రమదేవి ఆయన ప్రతిష్టను పెంచిందని చెప్పొచ్చు. బాహుబలి లాంటి సినిమా రిలీజ్ అయ్యాక కూడా రుద్రమదేవి మంచి రిజల్ట్ అందుకుంది. అయితే ఆ సినిమా ఎండ్ కార్డ్ లో ప్రతాపరుద్రుడు వస్తాడంటూ ఎనౌన్స్ చేసిన గుణశేఖర్ ఇప్పుడు ఆ సినిమా కాకుండా పురాణ గాథను తెరకెక్కించే పనిలో పడ్డాడట.
హిరణ్యకసిపుడు సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట గుణశేఖర్. స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్న గుణా అండ్ టీం ఇప్పటికే హిరణ్యకసిపుడు అనే టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించాడని తెలుస్తుంది. సడెన్ గా గుణశేఖర్ ఇచ్చిన ఈ షాక్ కు అందరు అవాక్కవుతున్నారు. భక్త ప్రహ్లాద హిరణ్యకసిపుడు అంటూ కేవలం తెలుగులో ఒకటి రెండు సినిమాలే వచ్చాయట ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి సంచలనం సృష్టించాలని చూస్తున్నాడు గుణశేఖర్. ఇక ఈ సినిమాలో లీడ్ రోల్ కోసం తమిళ స్టార్ హీరోలను అప్రోచ్ అవుతున్నట్టు తెలుస్తుంది.
అదే కన్ఫాం అయితే కనుక మళ్లీ గుణశేఖర్ సినిమాకు భారీ క్రేజ్ వచ్చేసినట్టే. రుద్రమదేవి సొంత నిర్మాణంలో చేసిన గుణశేఖర్ ఈ సినిమాను కూడా అదే తరహాలో కానిస్తాడని అంటున్నారు. మరి గుణ గట్స్ కు మెచ్చుకుంటూ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం.