గుంటూరులో వర్షం తీవ్రత… బుల్లెట్ పాయింట్స్

 guntur city full rain bullet points

నిన్నటి వరకు హైదరాబాద్‌ను వణికించిన వర్షాలు ఇప్పుడు గుంటూరు జిల్లాపై పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నరసరావుపేట శివార్లలో రెండు బస్సులు వాగులో చిక్కుకుపోయాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమను రక్షించాలంటూ బస్సులోంచి కేకలు పెడుతున్నారు. మరోవైపు రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో రైల్వే ట్రాక్ మీదకు భారీగా వరద నీరు చేరుకోవడంతో పలు రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మాచర్ల ప్యాసింజర్ పిడుగురాళ్లలోను, పల్నాడు ఎక్స్‌ప్రెస్ రెడ్డిగూడెంలోను, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ బెల్లంకొండలోను ఆగిపోయాయి.

సత్తెనపల్లిలో అత్యధికంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మాచర్ల, గుంటూరు, నరసరావుపేట, తెనాలి, చిలకలూరిపేట లోని శివారు ప్రాంతాలు జలమయం  అయ్యాయి. కారంపూడి వద్ద ఎర్రవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. చుట్టుపక్కల ఉన్న నాలుగు గ్రామాల లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గురజాల ఆర్టీసీ బస్టాండ్‌లోకి వరదనీరు చేరుకోవడంతో, రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నాగులేరు, చంద్రవంక ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

 •  గుంటూరు జిల్లా,దాచేపల్లి లో రాత్రినుండి కురిసిన కుండపోత వర్షానికి అద్దంకి,నార్కెట్ పల్లి హైవే రహదారి నీట మునక పొంగుతున్న నాగులేరు
 • గుంటూరు.రాజుపాలెం(మం) అనుపాలెం వద్ద సపటాపై నుండి వరద వరద నీరు ఉద్దృతం గా ప్రవహించటంతో నిలచి పోయిన పిడుగురాళ్ళ టూ గుంటూరు రాక పోకలు జలదిగ్బందం లో అంచులవారిపాలెం
 • నరసరావుపేట మండలం యళమంఢ వాగు పొంగి ఇళ్లలోకి నీరు ప్రజలు రోడ్ల మీద ఉన్నారు 
 •  గుంటూరుజిల్లా,నడికుడి లో సికింద్రాబాద్,గుంటూరు రాజధాని ఎక్స్ ప్రెస్ వర్షం కారణంగా నిలిపివేత
 • గుంటూరు జిల్లా,దాచేపల్లి లో రాత్రినుండి కురిసిన కుండపోత వర్షానికి అద్దంకి,నార్కెట్ పల్లి హైవే రహదారి నీట మునక పొంగుతున్న నాగులేరు
   
 • గురజాలలో రాత్రి 3 గంటల నుండి ఎడతెరుపు లేకుండా కురుస్తునృ వర్షం .
   
 • గురజాలలో రాత్రి 3 గంటల నుండి ఎడతెరుపు లేకుండా కురుస్తునృ వర్షం .
 •  గుంటూరు జిల్లాలో గంటల తరబడిగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో పట్టాలపై వరద నీరు చేరడంతో పలు రైళ్లను నిలిపివేశారు. రెడ్డిగూడెం వద్ద రైలు పట్టాలపై వరదనీరు ప్రవహిస్తుండటంతో పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ రైలును నిలిపివేశారు. అలాగే బెల్లంకొండలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌, పిడుగురాళ్లలో మాచర్ల ప్యాసింజర్‌ రైలు నిలిచిపోయాయి.
   
 • మంగళగిరి sc కాలనీ ఇళ్ళలోకి చేరిన వర్షపు నీరు.
SHARE