గుంటూరులో అగ్ని ప్రమాదం… 35కోట్ల ఆస్తి నష్టం

 Posted October 24, 2016

guntur lakshmi lavanya cold storage fire accidentగుంటూరు రూరల్ మండలం ఏటుకురు రోడ్డు లోని లక్ష్మిలావణ్య కోల్డ్ స్టోరేజ్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజాము 5గంటల ప్రాంతంలో గుర్తించిన స్టోరేజ్ యాజమాన్యం వెంటనే ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అప్పటికే బి చాంబర్ మొత్తం అగ్ని కీలకు వ్యాపించాయి. ఎస్పీ త్రిపాఠి తక్షణమే స్పందించి నగరంలోని పోలీసు సిబ్బంది మొత్తాన్ని ఘటనాస్ధలానికి పంపించారు. ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారుల

ఎఎస్పీ సుబ్బారాయుడు, ఎస్బి డిఎస్పి నాగేశ్వరరావు, నల్లపాడుపాడు సిఐ కుంకా శ్రీనివాసరావులో సమయస్పూర్తితో వ్యవహరించి పొక్లెయినర్ ను రప్పించి ఎ ఛాంబర్ గోడలు పగలగొట్టించారు. కూలీల సహాయంతో అందులోని మిర్చి బస్తాలను బయటకు తెప్పించగలిగారు. సుమారు 30వేల బస్తాల మిర్చి టిక్కీల నిల్వలు స్టోరేజ్ లో ఉండగా వాటిలో 50 శాతం నిల్వలను బయటకు తీయగలిగారు. జిల్లా కలెక్టర్ ఘటనా స్ధలాన్ని పరిశీలించారు. విద్యుత్ షార్ట్ సర్కూట్ కారణంగానే ఈప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని బావిస్తున్నట్లు కలెక్టర్ దండే మీడియాకు తెలిపారు. ఫైర్ నిబంధనలు పాటించలేదని తమ పరిశీలనలో తేలిందన్నారు. ఫైర్ నిబంధనలు పాఠించని స్టోరేజ్ లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అదేశాలు జారీచేసినట్లు చెప్పారు.

మరోవైపు బాదిత రైతులు తమకు పరిహారం తక్షణమే అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఇచ్చే విధంగా చూడాలని డిమాండ్ చేశారు….

SHARE