“గుంటూరోడు” వాయిదా పడ్డాడుగా..!!

 Posted February 16, 2017

gunturodu movie postponedపాండవులు పాండవులు తుమ్మెద సినిమా సక్సెస్ తర్వాత సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు మంచు మనోజ్. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో రెండు సినిమాలను రెడీ చేస్తున్నాడు. వాటిలో ‘గుంటూరోడు’ చిత్రం ఆడియో రిలీజ్ తో సహా అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ రెడీ అవుతుండగా  ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

కాగా  మొదట ‘గుంటూరోడు’ చిత్రాన్ని ఈ నెల 24వ తేదీన రిలీజ్ చేయాలని అనుకున్నా, పలు కారణాల వల్ల ఆ రిలీజ్ వాయిదా పడింది. తాజా సమచారం ప్రకారం గుంటూరోడు మూవీ మార్చి3 న ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. సత్య దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై మనోజ్ చాలానే ఆశలు పెట్టుకున్నాడు. ఇక ఒక్కడు మిగిలాడు సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ రెండింటిలో ఏ సినిమా హిట్టైన మనోడి కెరీర్ మళ్లీ ఊపందుకున్నట్లే.

SHARE