గుంటూరోడు రివ్యూ

163
Spread the love

Posted [relativedate]

gunturodu movie reviewచిత్రం: గుంటూరోడు 
తారాగణం : మంచు మనోజ్‌,  ప్రగ్యాజైశ్వాల్‌, సంపత్‌, కోట శ్రీనివాసరావు, రాజేంద్ర ప్రసాద్‌, రావు రమేశ్‌
సంగీతం: డి.జె. వసంత్‌ 
ఛాయాగ్రహణం: సిద్ధార్థ్‌ 
నిర్మాణం: క్లాప్స్‌ అండ్‌ విజిల్స్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ 
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: ఎస్‌.కె. సత్య 
విడుదల తేదీ: 3-3-2017

మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న మంచు మనోజ్ సినిమా అంటే అభిమానుల్లో కాస్తంత అంచనాలు ఉంటాయి. ఈ మంచువారసుడు తాజాగా నటించిన చిత్రం గుంటూరోడు. పూరీ జగన్నాథ్‌ శిష్యుడైన ఎస్‌.కె. సత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం,  మెగాస్టార్ చిరు వాయిస్ ఓవర్ అందించడంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. మరి ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ గుంటూరోడు మిర్చిలా ఘాటుగా ఉన్నాడా లేక చప్పగా ఉన్నాడా తెలుగు బుల్లెట్ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

కధ ఏంటంటే..

ఈ సినిమాలో మనోజ్… కన్నాగా, రాజేంద్ర ప్రసాద్‌… సూర్యనారాయణగా, ప్రగ్యాజైశ్వాల్‌.. అమృతగా, సంపత్‌రాజ్‌.. లాయర్‌ శేషుగా నటించారు.

గుంటూరు కుర్రాడైన కన్నా చదువు పూర్తికావడంతో స్నేహితులతో బలాదూరుగా తిరుగుతుంటాడు.  అందరితోనూ గొడవలు పడుతున్నాడని, అతడికి పెళ్లి చేయాలని నిర్ణయిస్తాడు అతని తండ్రి సూర్యనారాయణ. అయితే పెళ్లి చూపుల్లో పెళ్లికూతురి స్నేహితురాలైన అమృతను ఇష్టపడతాడు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి నానా తంటాలు పడుతుంటాడు. ఆమె అన్నయ్య ఎమ్మెల్యే కావాలనుకునే ఓ  క్రిమినల్‌ లాయర్‌. అనూహ్య పరిస్ధితుల్లో  కన్నాకి, అమృత అన్నయ్యకి మధ్య విభేదాలు తలెత్తుతాయి.  వీరి మధ్య గొడవులు ఎందుకు వచ్చాయ..? గుంటూరోడు తన ప్రేమను సాధించుకున్నాడా..? అనే ఆసక్తికర విషయాలను తెలుసుకోవానుకుంటే సినిమాను వెండితెరపై చూడాల్సిందే.

కధనం ఏంటంటే..

అవుడేడ్ కధలకు కాస్త ఎంటర్ టైన్ మెంట్ ను జోడించి వస్తున్న సినిమాలు టాలీవుడ్ లో  ఇటీవల బాగా పెరిగిపోయాయి. ఈ విధంగానే గుంటూరోడు కూడా వచ్చాడు.  ఫస్టాఫ్ అంతా రొటీన్ గా సాగుతుంది. కన్నా బాల్యాన్ని పరిచయం చేస్తూ చిరంజీవి ఇచ్చిన వాయిస్ ఓవర్‌తో  సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలన్నీ మామూలే. విరామ ఘట్టానికి ముందు వచ్చే సన్నివేశాలు, మనోజ్‌ చేసిన పోరాట సన్నివేశాలు కాస్త ఆకట్టుకుంటాయి.  సెకండాఫ్  ని కాస్త డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేసినా అది స్టోరీకి సింక్ అవ్వలేదు. కామెడీ సరిగా పండించలేదు.

ఎవరు ఎలా చేశారంటే..

మనోజ్ మాస్ హీరోగా మరో సారి నిరూపించుకున్నా సన్నివేశాలు పండలేదు. హీరోయిన్ నటన బాగుంది. క్రిమినల్‌ పాత్రలో సంపత్‌ నటన పర్వాలేదు అనిపిస్తుంది. కోట శ్రీనివాసరావు తలపండిన రాజకీయ నాయకుడిగా తన పాత్ర పరిధి మేరకు నటించారు. పృథ్వీ, ప్రవీణ్‌, సత్య తదితర కామెడీ గ్యాంగ్‌ ఉన్నా.. పెద్దగా నవ్వించలేకపోయారు. టెక్నికల్ వ్యాల్యూస్ బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్..

మ‌నోజ్ ఫైట్స్

ఇంటర్వెల్ సీన్

మైనస్ పాయింట్స్

రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే

కామెడీ

ఆఖరిపంచ్..

గుంటురోడు.. మామూలోడే

Telugu Bullet Rating: 2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here