జగన్ దెబ్బకు దివాలా తీసిన ఆ నాయకుడు ..?

Posted December 19, 2016

gurazala ex mla Bankruptcy because of jaganవై.ఎస్.రాజశేఖర రెడ్డి మృతి చెందిన తర్వాత జగన్‌కు సీఎం పదవి ఇవ్వాలంటూ కాళ్ళు అరిగేలా పాదయాత్రలు చేసి నియోజక వర్గం లో పార్టీ ని డెవలప్ చేయటం కోసం అహర్నిశలు కష్టపడి చివరకు ఇప్పుడు దాదాపు దివాలా తీసే స్థాయికి వచ్చాడట గుంటూరు జిల్లా గురజాలకు చెందిన మాజీ ఏంఎల్ఏ ఒకరు.పాపం జగన్ ని నమ్ముకొని ఆలా ఐపోయాడు అనుకొంటున్నారట అందరూ..

అయన పరిస్థితి చూసి తేరుకున్నబిసి సామాజిక వర్గం నాయకులు వైసీపీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధం గా ఉన్నారట .గురజాల నియోజక వర్గంలో 20 సంవత్సరాలుగా కీలకంగా ఉన్నఆ మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్‌ పార్టీని జగన్మోహన్‌రెడ్డి పెట్టిన నాటి నుంచి గురజాల నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారట.ప్రతి ఎన్నికల్లో ఆయనే పార్టీ కోసం ఖర్చులుభరిస్తూ రావడమే కాదు పార్టీ కోసం అప్పులు కూడా చేశారట.

సరస్వతీ భూముల వ్యవహారంలో వివాదం జరిగిన తర్వాత నియోజక వర్గ ఇంచార్జి కోసం అదే జిల్లాకు చెందిన నాయకుడు ఒకరు ప్రయత్నం చేశారట.ఈ క్రమంలో అధినేత జగన్ ఆయనకు న్యాయం చేస్తామని హామీ కూడా ఇచ్చారట. కాసు మహేష్‌రెడ్డి చేరికను కూడా అయన స్వాగతించారట కానీ జగన్మోహన్‌రెడ్డి సదరు నాయకుడి వర్గాన్ని అసంతృప్తికి గురిచేసింది.దివంగత రాజశేఖరరెడ్డి వరుసగా రెండుసార్లు పిలిచి మరీ టీటీడీ సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. జగన్ బాబు వైఖరి నచ్చట్లేదని పార్టీ మారుదామని సహా నాయకులు అంటున్నారట….

SHARE