గుత్తా జ్వాలకి పద్మ అందుకే రాలేదా?

0
380
gutta jwala reaction after padma award snub

Posted [relativedate]

gutta jwala reaction after padma award snub
బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలకి మరోసారి పద్మ అవార్డుల విషయంలో నిరాశ తప్పలేదు.ఈసారి కూడా పద్మ రాకపోవడంతో ఆమె గళమెత్తారు.పద్మ రానందుకు బాధగా లేకపోయినా ఎంపిక విధానం బాగా లేదన్నారు.మిక్స్డ్ డబుల్స్,మహిళల డబుల్స్ విభాగాల్లో టాప్ టెన్ లో ఉన్నప్పటికీ ప్రతిష్ఠాత్మక అవార్డ్స్ విషయంలో తనను పక్కనబెట్టడం ఎందుకో అర్ధం కావడం లేదన్నారు.15 ఏళ్లుగా దేశం కోసం ఆడి..ఎన్నో టోర్నీల్లో గెలిచినా ఉపయోగం లేకుండా తనను పట్టించుకోవడం లేదని ఆమె వాపోయారు.

పద్మ అవార్డులు తనకి రాకపోవడం వెనుక వున్న కారణాలు తెలియకపోయినా కొన్ని సందేహాలు ఆమె వ్యక్తపరిచారు.తాను ముక్కుసూటి మనిషి కావడం… ఉన్నదున్నట్టు మాట్లాడటం నచ్చకే తనను దూరం పెడుతున్నారని గుత్తా జ్వాలా ఆవేదన చెందారు.తనకి రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ఉందని …అయితే ఎప్పుడన్నది ఇప్పట్లో చెప్పలేనని ఆమె వివరించారు.ఆమె చెప్పినట్టే ముక్కుసూటిదనమే నిజంగా జ్వాలాకి పద్మ రాకుండా చేస్తుందని నమ్మే వాళ్లకి కొదవలేదు

Leave a Reply