ప‌ళ‌నిస్వామికి “గ‌వ‌ర్న‌ర్” గండం?

0
230
gvernor threat to pallanisamy

Posted [relativedate]

gvernor threat to pallanisamy
అసెంబ్లీలో పాస్ మార్కులు కొట్టేసిన ప‌ళ‌నిస్వామికి మ‌రో గండం పొంచి ఉందా? గ‌వ‌ర్న‌ర్ రూపంలోనే ఆ గండం ఉందా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ఎందుకంటే అసెంబ్లీలో జ‌రిగిన ర‌చ్చ గ‌వ‌ర్న‌ర్ దృష్టికి వెళ్ల‌డ‌మే కార‌ణం!!!

అసెంబ్లీ లోప‌లి నుంచి చిరిగిన చొక్కాతో బయ‌ట‌కు వ‌చ్చిన స్టాలిన్ అక్క‌డ్నుంచి నేరుగా రాజ్ భ‌వ‌న్ కు వెళ్లారు. ప్ర‌తిప‌క్ష స‌భ్యుల‌ను బ‌ల‌వంతంగా బయ‌ట‌కు పంపి… విశ్వాస ప‌రీక్ష‌ను నిర్వ‌హించార‌ని ఫిర్యాదు చేశారు. ర‌హ‌స్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ పెట్టాల‌ని కోరినా.. స్పీక‌ర్ ప‌ట్టించుకోలేద‌ని కంప్ల‌యింట్ చేశారు. దీనిపై గ‌వ‌ర్న‌ర్ అప్ప‌టిక‌ప్పుడు స్టాలిన్ కు ఎలాంటి హామీ ఇవ్వ‌క‌పోయినా… జ‌రిగిన ఘ‌ట‌నపై మాత్రం ఆరా తీసే ప‌నిలో ఉన్నార‌ట‌. ఒక‌వేళ నిజంగానే స‌భ‌లో బ‌ల‌ప‌రీక్ష ప‌ద్ధ‌తిగా జ‌ర‌గ‌లేద‌ని గ‌వ‌ర్న‌ర్ భావిస్తే…. ఆయ‌న జోక్యం చేసుకునే అవ‌కాశాలు లేక‌పోలేద‌న్న వాద‌న వినిపిస్తోంది.

గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు వీడియో ఫుటేజ్ ను తెప్పించుకొని మొత్తం ప‌రిశీలిస్తార‌ట‌. ఒక‌వేళ అందులో జ‌రిగిన ర‌చ్చ ఆయ‌న కంట్లో ప‌డితే మాత్రం … సీఎం ప‌ళ‌నిస్వామికి నోటీసులు పంపే అవ‌కాశ‌ముంద‌ని టాక్. అంతేకాదు స‌భ‌లో జ‌రిగిన త‌తంగంపై విచార‌ణ‌కు కూడా ఆదేశించే అవ‌కాశం లేక‌పోలేదు. అంతేకాదు మ‌రోసారి బ‌ల‌ప‌రీక్ష నిర్వ‌హించే ఆదేశించ‌డ‌మే కాకుండా… దాని ప‌ర్య‌వేక్ష‌ణ కోసం రాజ్ భ‌వ‌న్ నుంచి ఇద్ద‌రు ప‌రిశీల‌కుల‌ను కూడా ఆయ‌న పంపే అధికారం గ‌వ‌ర్న‌ర్ కు ఉంది.

గ‌తంలో క‌ర్ణాట‌క‌లోనూ య‌డ్యూర‌ప్ప బ‌ల‌ప‌రీక్ష స‌మ‌యంలోనూ త‌మిళ‌నాడు లాంటి ఘ‌ట‌నే జ‌రిగింది. అప్ప‌టి క‌ర్ణాట‌క గ‌వ‌ర్న‌ర్ భ‌ర‌ద్వాజ్ కూడా ఎడ్డీని మ‌రోసారి బ‌లం నిరూపించుకోవాల‌ని ఆదేశించారు. దీంతో ఆయ‌న మ‌రోసారి ప‌రీక్ష రాసి పాస‌య్యారు. ఇప్పుడు కూడా త‌మిళ‌నాడులో అలాంటి ఘ‌ట‌న జ‌రిగే అవ‌కాశం లేక‌పోలేదంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌వేళ అలాంటి ప‌రిస్థితులే వ‌స్తే… మ‌రోసారి ప‌రీక్ష రాసి పాస్ కావ‌డం ప‌ళ‌నిస్వామికి శ‌క్తిని మించిన పనే!!!

Leave a Reply