కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన హ్యాకర్స్

0
293
rahul11

Posted [relativedate]

Image result for rahul twitter account hacked
కాంగ్రెస్ పై ఏదో కుట్ర చేస్తున్నారంటూ వాపోతున్నారు ఆ పార్టీ నాయకులు. నిన్న రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిన విషయం మరిచిపోకముందే.. ఈరోజు మరో అకౌంట్ హ్యాక్ అయ్యింది. అయితే అది పార్టీ అగ్రనేతకు సంబంధించినది కాదు…ఏకంగా కాంగ్రెస్ పార్టీ అకౌంట్ నే హ్యాక్ చేశారు దుండగులు.
కాంగ్రెస్ ట్విట్టర్ అకౌంట్లో అభ్యంతరకర భాషను వాడారు హ్యాకర్స్. నోటికొచ్చినట్టు పోస్ట్ చేశారు. కనీసం రాయడానికి కూడా వీలులేని ఆ భాషను చూసి ఆశ్చర్యపోతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇంత దుర్మార్గంగా బరితెగించిన ఆ హ్యాకర్స్ ఎవరో తెలియక తికమకపడుతున్నారు.

కాంగ్రెస్ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ విషయంలో టెర్రరిస్టుల కోణం ఏదైనా ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే పోలీసులను సంప్రదించారు హస్తం నేతలు. అయితే ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది కాబట్టి ఇకనైనా ఈ హ్యాకర్లను దొరకబుచ్చుకొని తగిన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్స్.

Leave a Reply