ఆ దర్గా లోకి ఆడవాళ్ళు వెళ్ళొచ్చు…

  haji ali darga girls will go high court judgementఇంతవరకు నిషేధంగా వున్న ముంబయి హజి అలీ దర్గాలోని పవిత్రస్థలమైన అంతర్భాగంలోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ బొంబాయి హైకోర్టు తీర్పు చెప్పింది. హజీ అలీ దర్గా అంతర్భాగంలోకి మహిళలను అనుమతించకపోవడం రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని, ఆర్టికల్స్‌ 14, 15, 21కి వ్యతిరేకమని బొంబాయి హైకోర్టు వ్యాఖ్యానించింది. హజీ అలీ దర్గా అంతర్భాగంలోని పవిత్ర ప్రాంతానికి వెళ్లే మహిళలకు తగిన భద్రత కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని హైకోర్టు

ఆదేశించింది. ఆలయాలు, ప్రార్ధనా మందిరాలలో ప్రవేశాన్ని కోరుతూ భూమాతా బ్రిగేడ్ నాయకురాలు తృప్తీ దేశాయ్ ఇటీవ‌లే ప‌లు ఆల‌యాల్లోకి ప్ర‌వేశించి పూజ‌లు నిర్వ‌హించారు. ఆమె చేస్తోన్న‌ ఉద్యమ ఫ‌లితంగా ఇప్పటికే ప‌లు దేవాల‌యాల్లోకి మ‌హిళ‌లు ప్రవేశించారు. ఈ క్ర‌మంలోనే ముంబయిలోని ప్ర‌సిద్ధ‌ హజి అలి దర్గాలోనికి మ‌హిళ‌ల‌ను అనుమ‌తిస్తూ బాంబే హైకోర్టు ఈరోజు చ‌రిత్రాత్మ‌క‌ తీర్పునిచ్చింది. దర్గాలోకి మహిళల ప్రవేశంపై నిషేధం ఎత్తివేస్తున్న‌ట్లు న్యాయ‌స్థానం తెలిపింది.

తృప్తి దేశాయ్ హాజీ అలీ దర్గాను సందర్శిస్తే ఆమెను చెప్పులతో కొడ‌తామ‌ని కొన్ని రోజుల క్రితం కొందరు స్థానికులు హెచ్చ‌రిక‌లు జారీ చేసారు. ఒకసారి తృప్తీ దేశాయి దర్గా దగ్గరకు వచ్చారు. అయితే, అప్పుడు తోపులాట చోటుచేసుకోవడంతో ఆమె దర్గా లోపలికి వెళ్లకుండానే వెళ్లిపోయారు. ద‌ర్గాలోకి మ‌హిళ‌ల ప్రవేశం దృష్ట్యా వారికి భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కూడా కోర్టు ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

SHARE