హిందీ చిత్రాలు నో …….హన్సిక

0
803

  hansika no act bollywood movies

బాలీవుడ్ బ్యూటీ హన్సిక హిందీ చిత్రాలు చెయ్యదంట. తమిళ చిత్రాలే చేస్తుందట.తమిళ చిత్రాలు చెయ్యడానికే సమయం సరిపోతుందట.అందుకే తమిళ్ చిత్రాలకే ప్రాధాన్యం అంటుంది ఈ బొద్దుగుమ్మ …ఇటీవల ఉదయనిధి స్టాలిన్ కు జంట గా నటించినిన మనిదన్ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. ఆ కిక్ తో తాజాగా భోగన్ చిత్రం లో జయంరవితో ఈ బ్యూటీ రొమాన్స్ చేస్తుంది .

హన్సికకు జయం రవితో ఇది మూడో సినిమా .మొదట చేసిన ఎంగేయం కాదల్,రోమియా జూలియట్ రెండు చిత్రాలు హిట్టే.తమిళ్ లో భామ బా..గ..;బిజీ.. ఇంక తెలుగు,హిందీ ఏం పడతాయ్…ఏవి పట్టవు.రీసెంట్ హిట్’మనిదన్’ హన్సికకు బాగా నచ్చిందట.ఇందులో గ్రామీణ యువతిగా నటించిందట.ఇంతకు ముందు అరణ్మణై చిత్రంలో నా పాత్ర చాలా వైవిధ్యంగా అమరిందని హన్సిక చెప్తుంది.తన చిత్రాలు అన్నింటిలోనూ మనిదన్ పాత్ర పూర్తిగా భిన్నంగా ఉంటుందట.అందుకనేనేమో ఆ చిత్రం అమ్మడికి అంతాగానచ్చింది….దానికి తగ్గట్టు ఈ చిత్రం మంచి పేరు కూడా సంపాదించిపెట్టిందట ఇంకెందుకు నచ్చదు…బా..గ..నచ్చుతుంది.అంతే గదా హన్సిక అట్టగాక మారే ఏటి….

అన్నట్టు ఇంకోవిషయం జయం రవితో చేసిన మొదటి సినిమా ఎంగేయం కాదల్ కి ప్రభుదేవా దర్శకుడు.ఇప్పుడు చేసే భోగన్ కి ఆయన నిర్మాత.ఈ విధంగా హన్సిక తమిళ సినీరంగ సక్సెస్ లో ప్రభుదేవా కూడా ముఖ్య పాత్ర పోషించాడన్నమాట..

Leave a Reply