హాన్సిక ఆశలన్ని అతనిమీదే..!

Posted November 25, 2016

Hansika Shares Gopichand Movie Shooting Picsదేశముదురుతో ఎంట్రీ ఇచ్చిన హాన్సిక మోత్వాని తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తున్నా కోలీవుడ్ లో మాత్రం సూపర్ క్రేజ్ సంపాదించింది. అక్కడ స్టార్ ఇమేజ్ ఉన్నా సరే తెలుగులో స్టార్ క్రేజ్ దక్కించుకోవాలని హాన్సిక ఆరాటపడుతుంది. ఆ ప్రయత్నంలోనే సంవత్సరంలో ఒకటి రెండు తెలుగు సినిమాలకు సైన్ చేస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ మంచు విష్ణుతో లక్కున్నోడు సినిమా చేస్తున్న హాన్సిక సంపత్ నంది గోపిచంద్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.

మాస్ మసాల ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా మీద హాన్సిక ఆశలు పెంచుకుంది. అందుకే షూటింగ్ స్పాట్ లో గోప్చంద్ తో దిగిన పిక్ తన ట్విట్టర్ లో షేర్ చేసింది. చేసే సినిమా ఎవరు హీరో అనేదేం పట్టించుకోకుండా సిన్సియర్ గా అమ్మడు చేస్తున్న ఈ పబ్లిసిటీ చూస్తుంటే తెలుగులో మళ్లీ ఈ సినిమాతో ఫాంలోకి రావాలని చూస్తున్నట్టు ఉంది. తమిళ తంబీలకు బాగా నచ్చిన ఈ అమ్మడు అదే క్రేజ్ ను ఇక్కడ సంపాదించడానికి కష్టాలు పడుతుంది. అయితే ఇక్కడ స్టార్స్ తో కాకుండా కుర్ర హీరోలతో నటించడం వల్లే హాన్సికకు ఇంకా ఇక్కడ అంత ఫాలోయింగ్ రాలేదని చెప్పాలి. మరి గోపిచంద్ సినిమా అయినా సరే అంచనాలను మించి సక్సెస్ అయ్యి హాన్సిక ఇక్కడ కూడా సూపర్ హీరోయిన్ అవుతుందేమో చూడాలి.

SHARE