భజ్జీ పాపను చూడండి..

0
654

geeta-basra-harbhajan-singh-daughter

క్రికెటర్ హర్భజన్ సింగ్-మోడల్..బాలీవుడ్ బ్యూటీ గీతా బస్రాల ఇంట బోసినవ్వులు వికసించాయి. జులై 27న లండన్ లో గీతా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ శుభ సందర్భాన్ని అభిమానులతో పంచుకుంటూ తమ గారాలపట్టి తొలి చిత్రాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసిందామె. ఈ చిత్రంలో చిన్నారి మొహం కనిపించకపోయినా.. పసిపాప.. తల్లి చేయి పట్టుకున్న వైనం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటో ట్విట్టర్ లో ప్రత్యక్షమవగానే బజ్జీ, గీతల అభిమానులు, శ్రేయోభిలాషుల నుంచి వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ మెసేజ్ లు వెల్లువెత్తాయి. 

Leave a Reply