పొలిటికల్ గ్రౌండ్ లోకి భజ్జీ?

Posted December 22, 2016

harbhajan singh want to come politics joining in congress party
క్రికెట్ మైదానంలో తన స్పిన్ తో బ్యాట్స్ మెన్ ని ముప్పుతిప్పలు పెట్టిన హర్భజన్ సింగ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.త్వరలో అయన క్రీడా మైదానానికి గుడ్ బై కొట్టేసి పొలిటికల్ గ్రౌండ్ లోకి దూకబోతున్నాడు. పంజాబ్ ఎన్నికల బరిలో దిగడానికి అయన నిశ్చయించుకున్నట్టు సమాచారం.కాంగ్రెస్ లో చేరి జలంధర్ నుంచి పోటీ చేయడానికి భజ్జీ ఏర్పాట్లు చేసుకుంటున్నాడట. ఇటీవలే తండ్రి అయిన భజ్జీ రాజకీయాల్లోకి రావాలనుకోవడం పంజాబ్ లో హాట్ టాపిక్ అయింది.

ఇటీవలే నవజ్యోత్ సింగ్ సిద్ధూ కాంగ్రెస్ లోచేరడానికి డిసైడ్ అయ్యే రాహుల్ గాంధీ తో సమావేశమయ్యారు.ఇంతలో భజ్జీ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గుజూపడం ఆ పార్టీకి కొత్త ఉత్సాహం ఇస్తోంది.భజ్జీ నిర్ణయం వెనుక పంజాబ్ రాజకీయాలే కాకుండా క్రికెట్ అంశాలు కూడా ఓ కారణమని తెలుస్తోంది.కెరీర్ రెండో దశలో తనకి అనుకున్నంత అవకాశాలు రాకపోవడానికి రాజకీయ కారణాలు ఉన్నాయని కూడా భజ్జీ డౌట్ పడుతున్నారు.ఏదేమైనా ఇద్దరు క్రికెటర్ల రాకతో పంజాబ్ కాంగ్రెస్ ఉత్సాహంతో ఉప్పొంగిపోవడం ఖాయం.

SHARE