స్నేహితుడి కోసం ప్రాణం ..

Posted September 28, 2016

  hari krishna ramesh software employees death hyderabad

ప్రాణ స్నేహితులు అనే మాట ఎన్నో సార్లు వినివుంటాం.కానీ ఈ తెల్లవారుజామున జరిగిన విషాద ఘటన గురించి తెలిస్తే ఇలాంటి స్నేహం ఉంటుందా అనిపిస్తుంది. అంతలోనే జరిగింది తెలిసి కంట నీరొలుకుతుంది.హరికృష్ణ ,రమేష్ అనే వాళ్ళు ఇద్దరు స్నేహితులు.గుంటూరు జిల్లా ,కారంపూడి మండలం ,వేపాకంపల్లి వీళ్ళ వూరు. ఉద్యోగరీత్యా ఇద్దరూ హైదరాబాద్ లో వుంటున్నారు.ఈ తెల్లవారుజామున బైక్ మీద వెళ్తుండగా ఓ వాహనం వీరిని ఢీకొట్టింది.

హరికృష్ణ అనే 28 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అక్కడికక్కడే చనిపోయాడు.స్నేహితుడి మరణాన్ని జీర్ణించుకోలేక రమేష్ భరత్ నగర్ లోరైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు.ఆత్మహత్య తప్పనిపించినా ఈ రోజుల్లోస్నేహానికి ఇంత విలువ ఇచ్చే వారున్నారా అని ఆశ్చర్యపోతున్నారు స్థానికులు .

SHARE