ఏపీని చూసి హ్యాపీ ఫీల్ అవ్వండి..హరీష్ కామెంట్

0
699
harish rao says about ap assembly situation in telangana assembly

 Posted [relativedate]

harish rao says about ap assembly situation in telangana assembly
విడిపోయిన అన్నదమ్ములు ఒకరి గురించి ఇంకోరు ఆలోచిస్తారో లేదో గానీ …ఆంధ్ర, తెలంగాణ నేతలు మాత్రం తమ అవసరార్ధం పక్క రాష్ట్ర ప్రస్తావన బాగానే తెస్తున్నారు.తాజాగా అలాంటి ఓ సందర్భం వచ్చింది.తెలంగాణ అసెంబ్లీ లో విపక్ష నేతలకు సరైన అవకాశాలు రావడం లేదని కాంగ్రెస్ నేత జానా రెడ్డి,బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఆక్షేపించారు.

విపక్ష ఎమ్మెల్యేల ఆక్షేపణకు సమాధానం ఇస్తూ మంత్రి హరీష్ రావు ఏపీ అసెంబ్లీ ప్రస్తావన తెచ్చారు.తెలంగాణ అసెంబ్లీ లో విపక్ష నేతలు అడిగినప్పుడల్లా అవకాశాలు వస్తున్నాయని చెప్పిన హరీష్ ..”ఏపీ అసెంబ్లీ లో జరుగుతున్నది చూడండి..అక్కడ ప్రతిపక్ష నేతకే మైక్ దొరకడం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు మైక్ కట్ అవుతోంది.కానీ తెలంగాణాలో జానా రెడ్డి ఎప్పుడు అడిగినా మైక్ దొరుకుతోంది.ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా జానాకి గౌరవం,ప్రాధాన్యం ఇస్తున్నారు.తెలంగాణ అసెంబ్లీలో తెరాస కన్నా విపక్షాలకు ఎక్కువ అవకాశాలు వస్తున్నందున ఏపీ పరిస్థితి చూసుకుని హ్యాపీగా ఫీల్ అవ్వండి ” అని హరీష్ విపక్ష నేతలకి హితవు చెప్పారు.

Leave a Reply