Posted [relativedate]
తెలంగాణ సీఎం కేసీఆర్ లాగే.. హరీశ్ రావు మాటల తూటాలు పేలుస్తారు. ముఖ్యంగా ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వడంతో ఆయన ముందుంటారు. అందుకే ఆయనను అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా నియమించారు కేసీఆర్. అందులో ఆయన విజయవంతం కూడా అయ్యారు. ఈ మధ్య ప్రతిపక్షాలు దూకుడు పెంచడంతో వారికి స్ట్రాంగ్ కౌంటరివ్వాలని సీఎం కేసీఆర్ డిసైడయ్యారు. త్వరలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాలు వాడీవేడీగా జరగడం ఖాయమని భావిస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలకు దీటైన సమాధానం ఇవ్వాలంటే ముందుగా ప్రిపరేషన్ ఉండాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వారికి సమాధానం చెప్పాలంటే పక్కా ఆధారాలుండాలి. లెక్కలతో సహా చెప్పాలి. మంత్రుల దగ్గర ఆ డేటా మొత్తం ఉండాలి. అలా ఉండాలంటే మినిస్టర్లు ముందు నుంచే ప్రిపేర్ గా ఉండాలి. అందుకే మంత్రులు ఈ విషయంలో పర్ ఫెక్ట్ అయ్యేలా హరీశ్ రావు వారికి పాఠాలు చెప్పబోతున్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా ఈ బాధ్యతలను హరీశ్ రావుకు అప్పగించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో హరీశ్ రావు ఇక కదన రంగంలోకి దూకపోతున్నారు. మంత్రులకు పాఠాలంటే పుస్తకం పట్టుకొని పాఠాలు నేర్పించడం కాదు… సరైన ప్రజెంటేషన్ ఉండేలా వారికి దిశానిర్దేశం చేస్తారు. అంటే ఇలా మంత్రులకు హరీశ్ రావు పాఠాలు చెప్పబోతున్నారన్న మాట.