ఆ నెంబర్ వెనక ఉన్న సీక్రెట్ ఏంటి హరీశ్??

0
589
harish shankar use 2425 number plate in gabbar singh and dj movie

Posted [relativedate]

harish shankar use 2425 number plate in gabbar singh and dj movieసినిమావాళ్లకి సెంటిమెంట్స్ ఎక్కువన్న విషయం తెలిసిందే. సినిమా ప్రారంభోత్సవం నుండి రిలీజ్ సమయంలో ధియేటర్ ముందు కటౌట్లు పెట్టేవరకు ప్రతి విషయంలోనూ వాళ్లు సెంటిమెంట్స్ ని నమ్ముతుంటారు. ఈ మార్గంలోనే నడుస్తున్నాడు దువ్వాడ జగన్నాధం దర్శకుడు హరీశ్ శంకర్. మాస్ పీపుల్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ ను కూడా ఆకట్టుకునే ఈ దర్శకుడు ఎంతగా సెంటిమెంట్స్ ను ఫాలో అవుతుంటాడో రిలీజైన డిజీ ఫస్ట్ లుక్  చెబుతోంది.

ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ ని గమనిస్తే మునుపెన్నడూ చూడని ఓ డిఫరెంట్ లుక్ లోఅల్లు అర్జున్ దర్శనమిచ్చాడు. ఓ స్కూటర్‌ పై కూరగాయాలు తీసుకెళ్తూ కనిపించాడు. ఇంకాస్త డీప్ గా అబ్జర్వ్ చేస్తే ఆ స్కూటర్ నెంబర్ 2425 అని తెలుస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన గబ్బర్ సింగ్ సినిమాలో కూడా ఇదే నెంబర్ తో ఉన్న బైక్ ను వాడాడు దర్శకుడు. అంతేకాకుండా హరీశ్ తన పర్సనల్ లైఫ్ లో కూడా  ‘2425’ నెంబర్ తో రిజిస్ట్రర్‌ చేయించిన కారునే ఉపయోగిస్తాడట.

మరి గబ్బర్ సింగ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఆ నంబర్‌ సెంటిమెంట్ గా మారి తన పర్సనల్ లైఫ్ లోనూ అలాగే తాను ప్రస్తుతం చేస్తున్న సినిమాలోనూ ఉపయోగిస్తున్నాడో లేక పర్సనల్ లైఫ్ లో కార్ నెంబరే తన సినిమాల్లో ఉపయోగిస్తున్నాడో హరీశే చెప్పాలి.

Leave a Reply