Saturday, December 4, 2021
HomeEntertainmentCinema Latestఅయ్యగార్లు ఆలోచించండి..!

అయ్యగార్లు ఆలోచించండి..!

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంటగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘డీజే’ చిత్రం వివాదంలో చిక్కుకున్న విషయం తెల్సిందే. ఇటీవలే విడుదలైన గుడిలో బడిలో పాట యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. సౌత్‌ ఇండియాలో ఏ పాటకు రాని వ్యూస్‌ ఆ పాటకు వచ్చాయి. మరో వైపు ఆ పాటపై విమర్శలు కూడా వచ్చాయి. అయ్యగార్లు ఈపాటలోని కొన్ని పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ సెన్సార్‌ బోర్డు పెద్దలకు మరియు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. ఈ విషయమై దర్శకుడు హరీష్‌ శంకర్‌ కాస్త సీరియస్‌గా స్పందించాడు.

దర్శకుడు టీవీ9తో మాట్లాడుతూ.. ప్రస్తుతం ‘డీజే’ చిత్రం చివరి దశ షూటింగ్‌ జరుపుకుంటుంది. చాలా బిజీగా ఉన్నాం. అయితే ఈ సమయంలో పాటపై వస్తున్న విమర్శలపై క్లారిటీ ఇచ్చేందుకు ఇలా మీ ముందుకు వచ్చాను. నేను 16 అణాల బ్రహ్మణ కుటుంబం నుండి వచ్చిన వాడిని. నేనో హిందువును అయినందుకు ప్రతినిత్యం గర్విస్తున్నాను. అలాంటి నేను బ్రహ్మణ సమాజంను ఎందుకు అవమానించేలా చేస్తాను. ఒక బ్రహ్మన యువకుడు ప్రేమలో పడ్డప్పుడు అతడికి తెలిసిన పదాలతో డ్యూయేట్‌ పాడుకుంటాడు. సినిమాను సినిమాలా చూడాలని, తాను బ్రహ్మణ యువకుడిని హీరోగా చూపించాను, కామెడీ కోసం ఉపయోగించలేదు అంటూ హరీష్‌ శంకర్‌ అన్నాడు. ప్రతి పదం కూడా పవిత్రంగా భావించి నేను ఆ పాటను రాయించాను అని, త్వరలోనే రచయిత సాహితితో కలిసి మీ ముందుకు వస్తాం. అప్పుడు ఖచ్చితంగా అన్ని అనుమానాలను నివృత్తి చేస్తామంటూ చెప్పుకొచ్చాడు. హరీష్‌ శంకర్‌ మాటలతో అయినా అయ్యగార్లు ఆలోచిస్తారేమో చూడాలి.

- Advertisment -
spot_img

Most Popular