హరితహారం లో నాని మరియు మజ్ను…

0
528
Hero-Nani-and-Majnu1
ఎంతో పవిత్రమైన పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశం తో , తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం లో హీరో నాని మరియు “మజ్ను” చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కోసం సేకరించిన వివిధ రకాల మొక్కలను చిత్ర బృందం ఈ రోజు నాటటం జరిగింది. ఈ సందర్భం గా హీరో నాని మాట్లాడుతూ, ” హరితహారం అనేది చాలా మంచి ఐడియా. పర్యావరణాన్ని కాపాడాలని అందరూ అంటారు కానీ ఎవ్వరు పెద్దగా ఏమీ చేయరు. అందుకు భిన్నం గా CM గారు అవేర్నెస్ పెంచే ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడం నిజం గా చాలా మంచి విషయం. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ఈ కార్యక్రమం లో ఉత్సాహం గా పాల్గొంటోంది. 
ఎవరి ఇళ్లల్లో వాళ్ళు నాటటం కాకుండా, మా మజ్ను చిత్ర బృందం మొత్తం కలిసి ఈ కార్యక్రమం లో పాల్గొనాలని నిర్ణయించుకుని, ఇలా చేస్తున్నాం. ఎవరికి తోచిన విధం గా వారు, ఒక చిన్న చోటు ఉన్నా కూడా ఒక మొక్కను పెంచితే, ఖచ్చితం గా మంచి మార్పు ఉంటుంది అని అనుకుంటున్నాను”, అని అన్నారు. 

Leave a Reply