హ్యాట్రిక్ డైరక్టర్ భారీ డిమాండ్..!

Posted November 12, 2016

kss1216పరిశ్రమలో ఒక్క హిట్ కొడితే ఆ దర్శకుడి దశ తిరుగుతుంది. అలాంటిది మూడు హిట్లు అవి కూడా ఆ హీరోల కెరియర్ లో మైల్ స్టోన్ మూవీస్ గా నిలిస్తే.. అలాంటి రేర్ ఫీట్ తో ఏ దర్శకుడు పొందలేని అరుదైన రికార్డును అందుకున్న కొరటాల శివ తాను సినిమా తీస్తే బొమ్మ హిట్ అనే విధంగా చేశాడు. అయితే జనతా గ్యారేజ్ తర్వాత మన వాడి రేంజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ తో సినిమాకు సిద్ధమవుతున్నాడు కొరటాల శివ.

ఆల్రెడీ ఆ సినిమాకు ముహుర్తం కూడా పెట్టేశారు. అయితే అసలైతే సినిమా రెమ్యునరేషన్ గా 10 కోట్లు తీసుకునే శివ ఈ సినిమాకు మరో మూడు అదనంగా తీసుకుంటున్నాడట. అంటే 13 కోట్లన్నమాట అది చాలదు అన్నట్టు ఓవరీస్ రైట్స్ మీద కూడా తన కన్ను పడ్డదట. మహేష్ సినిమా ఓవర్సీస్ లో మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే 15 కోట్ల పైన ఎంత వస్తే అది చెరిసగం అనేస్తున్నాడట కొరటాల శివ. డిమాండ్ పెరిగింది కాబట్టి కొరటాల అడిగిన వాటిని ఓకే అంటున్నారట నిర్మాతలు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి నుండి స్టార్ట్ అవుతుంది.

SHARE