తేనె ..ఉసిరి ..చలికాలం డాక్టర్లు

Posted November 11, 2016

honey and amla benefits
మధు అంటే తేనే ..ఈ తేనె వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. అంటే కాకుండా నవంబర్ ,డిసెంబర్ మాసాల్లో ఎక్కువగా లభించే ఉసిరి కాయల వల్ల కూడా అనేక రకాల ఆరోగ్యకరమైన లాభాలున్నాయి . ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే శరీరానికి ఎక్కువ పోషకాలు లభించడమే కాదు, ఎన్నో అనారోగ్యాలను కూడా దూరం చేసుకోవచ్చు.

వీటిని ఎలా వాడితే మనకు మేలు కలుగుతుందో చూద్దాం ..

ఒక సీసా తీసుకుని అందులో సగం వరకు తేనెతో నింపాలి. దాంట్లో బాగా కడిగి నీడలో ఆరబెట్టిన ఉసిరికాయలను వేసి నిల్వ చేయాలి . ఉసిరికాయలు పండ్ల జామ్‌లా మారిన తర్వాత రోజుకొకటి చొప్పున అదే జార్‌లోని తేనెతో కలిపి ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి.
health benefits of eating honey and amla

ఈలా చేయడం వల్ల లివర్ సమస్యలన్నీ దూరమవుతాయి.లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. జాండిస్ వంటి వ్యాధులు ఉంటే అవి త్వరగా నయం అవుతాయి. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి పంపడంలో లివర్ మరింత చురుగ్గా పనిచేస్తుంది. వయస్సు మీద పడడం వల్ల చర్మం ముడతలుగా తయారవుతుంటుంది. అయితే పైన చెప్పిన తేనె, ఉసిరి మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటుంటే దాంతో ఆ ముడతలు తగ్గిపోతాయి. దీనివల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. కాంతివంతంగా కూడా మారుతుంది.

చలి కాలంలో ఆస్తమా అనేది చాలామందిని ఇబ్బందులు పెడుతుంది. సరిగ్గా శ్వాస కూడా తీసుకోలేరు. అయితే తేనె, ఉసిరి మిశ్రమాన్ని తీసుకుంటే దాంతో ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే తేనె, ఉసిరి మిశ్రమంలో ఉండే సహజసిద్ధమైన పోషకాలు ఆస్తమాను దూరం చేస్తాయి. శ్వాస కోశ సమస్యలు రాకుండా చూస్తాయి.

గ్యాస్,అసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి.ఆకలి మందగించిన వారు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే చాలా మంచిది.దీంతో ఆకలి పెరుగుతుంది.మలబద్దకం, పైల్స్ వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. తేనె, ఉసిరి మిశ్రమాన్ని క్రమంతప్పకుండా సేవిస్తుంటే శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. దీంతో గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. తేనె, ఉసిరి మిశ్రమం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు అంతా కరిగిపోతుంది. దీనివల్ల అధికంగా ఉన్న బరువు తగ్గుతారు. ఇది స్థూలకాయం ఉన్న వారికి చాల ఉపకరిస్తుంది

తేనెలో సహజసిద్ధమైన యాంటీ వైరల్ గుణాలు, ఉసిరిలో యాంటీ బయోటిక్ గుణాలు ఉన్నాయి. వైరస్‌లు, బాక్టీరియాలపై సమర్థవంతంగా పోరాటం చేస్తుంది. ఈ క్రమంలో చలికాలంలో మనకు కలిగే దగ్గు, జలుబు, గొంతు ఇన్‌ఫెక్షన్ వంటి వ్యాధులు నయమవుతాయి. చలికాలం మన జీర్ణశక్తి చాలా తక్కువగా ఉంటుంది. అయితే తేనె, ఉసిరి మిశ్రమాన్ని తీసుకుంటే. ఆహారం తేలిగ్గా జీర్ణమవుతుంది.

SHARE