యుక్త వయస్సు లో యువతి యువకుల కోసం హెల్త్ టిప్స్ ..

0
905
health tips of youth from food

Posted [relativedate]

health tips of youth from food**యుక్త వయసులో వారి శరీర పెరుగుదల వేగంగా ఉంటుంది కావున వారికి ఎక్కువ క్యాలోరీలు అవసరం, ఎక్కువ క్యాలోరీలను కలిగి ఉండే పాల పదార్థాలు కూడా తీసుకోవాలి. తృణధాన్యాలు, ఓట్మీల్, చీస్ ఎక్కువగా ఉన్న ఆమ్లెట్, కాల్చిన బంగాలదుంపలు సులువుగా, త్వరగా మరియు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ బరువు పెరగటానికి ఉపయోగపడతాయి.

**యుక్త వయసులో పాల ద్వారా బరువు పెరగవచ్చు. భోజనము మరియు ఉదయం తీసుకునే ఆహరం తరువాత ఒక గ్లాసు త్రాగటం వలన మీ బరువు సులువుగా పెరుగుతుంది.

**భోజనం తరువాత ఆరోగ్యాన్ని పెంపొందించే ద్రావనాలను తాగండి. ఫ్రూట్ షేక్స్, మిల్క్ షేక్స్, మంచి ద్రావనాలను తాగటం వల్ల బరువు పెరుగుతుంది.
అవసరమైన మోతాదులో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, మరియు ఆరోగ్యవంతమైన ఫాట్’లను తీసుకోండి.

health tips of youth**శరీరానికి కావలసిన క్యాలోరీలు వారి వయసు మరియు లింగత్వం బట్టి మారుతుంది. సాధారణంగా యుక్త వయసులో ఉన్న వారికి 1,800 నుండి 3,500 క్యాలోరీలు అవసరం.

**యుక్త వయసులో ఉన్న ఆడవారికి రోజులో 1,800 నుండి 2,400 క్యాలోరీలు, యుక్త వయసులో ఉన్న అబ్బాయిలకి 2,200 నుండి 3,200 క్యాలోరీలు అవసరమని తెలిపారు.

hair fall tips**జుట్టు అధికంగా రాలితే మానసికంగా కృంగిపోతుంటారు. అలా కృంగిపోవటం వల్ల కూడా జుట్టు ఇంకా రాలే శాతం అధికమవుతుందని మర్చిపోరాదు. జుట్టు అధికంగా రాలే వారు తేలికపాటి టిప్స్‌తో పాటు కొన్ని హోమ్‌ రెమిడీ్‌సను ఉపయోగించి ఉపశమనం పొందవచ్చు

**అధికంగా జుట్టు రాలిపోతుంటే మొదట ఓ రెండు విషయాలు పాటించాలి. ఒకటి పొడి జుట్టును పలుమార్లు దువ్వడం చేయకండి. దీని వల్ల జుట్టు రాలిపోయే అవకాశాలెక్కువ. ఇక రెండోది రోజూ ఉదయాన్నే తల మాడుని మసాజ్‌ చేయించుకోవాలి. దీని వల్ల పుర్రెమీద చర్మం ఉత్తేజితమవుతుంది. తద్వారా జుట్టు మూలాలు ఆరంభమయ్యే చోట ఉండే చిన్నపాటి రంధ్రాలు చురుకై ఆశించిన మంచి ఫలితం కలుగుతుంది.

**ఆలివ్‌ లేదా కొబ్బరి నూనెను తీసుకుని దానిలోకి రెండు చుక్కల నిమ్మరసం వేయాలి. దీన్ని మిక్స్‌ చేసి తలకి అప్లై చేయాలి. ఒక గంట పాటు ఆరనివ్వాలి. తర్వాత షాంపూతో తలని శుభ్రపరుచుకోవాలి.

***ఒక పాత్రలో నీటిని కాచి దాంట్లో కొన్ని చుక్కల ఆలివ్‌ నూనె వేయాలి. ఒక టవల్‌ని ఆ నీటిలో ముంచి తలని కవర్‌ చేసేట్లు చుట్టేయాలి. ఇది న్యాచురల్‌ స్పా అనుకోవచ్చు.

**వెల్లుల్లి, అల్లం లేదా ఉల్లి రసాన్ని రాత్రి పడుకునేముందు తలకి బాగా పట్టించుకోవాలి. ఉదయం నిద్ర లేస్తూనే జుట్టును శుభ్రం చేసుకోవాలి. చక్కని ఫలితం కలుగుతుంది. సో యూత్ బెస్ట్ అఫ్ లక్ ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here