కాలాన్ని బట్టి ఆరోగ్యం కాపాడుకోవటం ఎలా..? పార్ట్-1

0
2038

cold cough images

వాతావరణ మార్పులను బట్టి సంవత్సరాన్ని ఆరు ఋతువులుగా విభజించారు. ఈ ఆరు ఋతువుల్లో వచ్చే మార్పులు మన ఆరోగ్యం పై కూడా వివిధ రకాల ప్రభావాన్ని చూపిస్తాయి. ఒక్కో ఋతువు ఒక్కో విధమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఋతువులకు అనుగుణంగా మనం ఎలాంటి జాగ్రత్తలు, ఆహారం తీసుకుంటే మంచిదో ఆయుర్వేదం వివరించింది. అదేంటో మనమూ చూద్దాం!.

మొత్తం ఆరు ఋతువుల్లో రాబోయేది వర్ష ఋతువు.
2a

వర్షఋతువు (జులై, ఆగస్ట్):

 1. ఈ వర్ష ఋతువులో వాతవ్యాధులు విజృంభిస్తాయి. వాత సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ కాలంలో తియ్యగా, పుల్లగా, ఉప్పగా ఉండే పదార్థములు తీసుకోవచ్చు.
 2. పెరుగు తినేటపుడు అందులో కొద్దిగా మిరియపుపొడి తీసుకొంటే మంచిది.
 3. గోధుమలు, బియ్యం, మినుములతో చేసే వంటకాలు ఈ కాలంలో శ్రేష్టం.
 4. బావినీటిని వాడటం మంచిది.
 5. మసాజ్ చేయించుకోవడం అవసరం.
 6. పగటిపూట భోజనం తర్వాత నిద్రపోవడం తగదు.

sarath ruthuvu

శరదృతువు (సెప్టెంబర్, అక్టోబర్):

ఈ కాలంలో పిత్తవ్యాధులు ప్రకోపించే అవకాశముంది. ఈ కాలంలో వచ్చే ఆరోగ్య సమస్యల్ని తట్టుకోవడానికి

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

 1. భోజనంలో గోధుమలు, బియ్యం, తృణధాన్యాలు, నెయ్యి, చిక్కుడుకాయలకు అధిక ప్రాధాన్యమివ్వాలి.
 2. తీపి, వగరు, చేదు పదార్థాలు ఎంత ఎక్కువ తింటే అంత మంచిది.
 3. బావినీటి వాడకం మంచిది.
 4. ఆహారంలో కర్పూరం, మంచి గంధం వాడకం శ్రేష్టం.
 5. ఈ ఋతువులో పెరుగు వాడకం మేలు చేయదు.
 6. ఈ ఋతువులో ఎండ మంచిది కాదు.
 7. పులుపు, కారం ఎంత తక్కువ తింటే అంత మంచిది.
 8. బలంగా వుండే వాళ్ళు రక్తదానం చేయడానికి శరదృతువు బాగా అనువైన కాలం.

ఆరోగ్యం పరంగా అతి సున్నితమైన ఋతువు ఇది. దీన్నే ఆయుర్వేద వైద్యులు బహు చమత్కారంగా చెప్పారు. వైద్యస్య శారదీమాత పితాకుసుమాకర’  అంటే శరత్కాలము వైద్యులకు తల్లి అని, వసంత కాలము తండ్రి అని వీరి భావం. అంటే డాక్టర్లకు ఎక్కువ డబ్బులు, మనకు ఎక్కువ జబ్బులు వచ్చే కాలాలివే.

సశేషం.

తరువాయి భాగం తరువాతి వచ్చే సంచికలో..

Leave a Reply