బాత్ రూమ్ లో గుండెపోటు కి కారణం ఇదే…

Posted [relativedate]

 heart attack reason bathroom
బాత్ రూమ్ లోగుండెపోటు వచ్చి చనిపోతున్న వార్తలు ఇటీవల ఎక్కువగా వింటున్నాం.అసలు బాత్ రూమ్ లో గుండెపోట్లు ఎక్కువగా ఎందుకొస్తాయి?ఆ పరిస్థితిని నివారించే అవకాశముందా ?ఈ ప్రశ్నలకి జవాబు చూద్దాం.

గుండెపోటు మీద పరిశోధన చేస్తున్న ఓ ప్రొఫెసర్ బాత్రూం మరణాలపై కీలక విషయాలు వెల్లడించారు.సహజంగా శీతాకాలంలో ఈ సంఘటనలు ఎక్కువ. శరీర,రక్తపు ఉష్ణోగ్రతలకు గుండెపోటుకు దగ్గర సంబంధముంది.అందుకే స్నానం చేసేటపుడు ఓ చిన్న జాగ్రత్త పాటిస్తే గుండెపోటు నుంచి తప్పించుకోవచ్చు.నీళ్లు మొదట ఎట్టి పరిస్థితుల్లో తల మీద పోసుకోకూడదు. ఆలా పోసుకుంటే శరీరం హఠాత్తుగా ఉష్ణోగ్రతల మార్పుకి తట్టుకోలేదు.తల మీద చన్నీళ్ళు పడగానే వేడి నెత్తురు ఒక్కసారిగా పైకి అంటే తలభాగంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది.దీంతో రక్తనాళాల మీద ఒత్తిడి పెరిగి గుండె లేదా మెదడు స్ట్రోక్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

ఆలా బాత్ రూమ్ స్ట్రోక్స్ తప్పించుకోడానికి చేయాల్సిన పని ఇదే..ముందుగా పాదాలు,తరువాత తల మినహా మిగిలిన శరీర భాగాలు తడుపుకోవాలి.చివరగా తల మీద నీళ్లు పోసుకోవాలి.ఈ చిన్న చిట్కా పాటిస్తే బాత్ రూమ్ గుండెపోటు నుంచి తప్పించుకోవచ్చు.ముఖ్యంగా బీపీ,కొలెస్ట్రాల్,గుండె సమస్యలు,మెగ్రైన్ ఉన్న వారికి ఈ చిట్కా ఎంతో ఉపయోగకరం.మీకు తెలిసిన వాళ్లందరికీ ఈ విషయం తెలియజేస్తే వారికి ఎంతో మేలు చేసిన వాళ్ళవుతాం.

Leave a Reply