గుండె పోటు లక్షణాలు…..

0
563

 heart attacked reasons

Posted [relativedate]

ఈ లక్షణాలు కనిపిస్తే…… కొద్ది రోజుల్లో గుండెపోటు రాబోతోందని జాగ్రత్తపడండి

తప్పకుండా చదవండి……….మీ మిత్రులకు ,శ్రేయోభిలాషులకు అందరికీ తెలియజేసి జాగ్రత్తపరచండి.

రాబోయే గుండెపోటును ముందుగానే మనం గుర్తించవచ్చా…………..?

ఖచ్చితంగా అవుననే చెబుతున్నాయి వైద్య పరిశోధనలు.

ఇంతకుముందు కాలంలో యాభై ఏళ్ళకు వచ్చే గుండెపోటులు , ఇప్పుడు ముప్పై ఏళ్ళ వాళ్లకు కూడా వస్తూ ప్రాణాపాయాన్ని కలిగిస్తున్నాయి. కాబట్టి లక్షణాలను గుర్తించి అందరూ జాగ్రత్తపడండి.

రాబోయే గుండెపోటును సూచించే లక్షణాలు ఏమిటంటే…………

గుండె ప్రాంతంలో అసౌకర్యంగా ఉండి, నొప్పి క్రమేపీ ఎడమచేతికి , కొన్నిసార్లు కుడి చేతికి , గొంతు , దవడలు , పొట్ట భాగాలకు విస్తరిస్తుంది. ఈ అసౌకర్యాన్ని సాధారణ నొప్పులుగా భావిస్తే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.

తరచూ వాంతులు అవడం లేదా వాంతులు అయ్యేలా ఉండి………. అకస్మాత్తుగా తీవ్రస్థాయిలో తలపోటు రావడం వంటివి జరిగితే మీ గుండె బలహీనపడుతోందని గుర్తించండి.

ఉన్నట్లుండి ముఖం నీరసంగా కనిపించడం , కాళ్ళూ, చేతుల్లో ముఖ్యంగా చాతీ ప్రక్క భాగంలో నొప్పిగా అనిపిస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలుగుతాయి. మానసికంగా కూడా ఒత్తిడి పెరిగినట్లు అనిపిస్తుంది. మెదడు మీ ఆధీనంలో ఉండకుండా , మాటల్లో తికమక పడటం , విషయాన్ని అర్థం చేసుకోవడంలో అయోమయం కలుగుతాయి.

తరచూ కళ్ళు తిరిగినట్లు అనిపించడం , దృష్టిలో ఆకస్మిక తేడాలు ఏర్పడటం , శరీరమంతా చెమటలు పట్టేయడం వంటి తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి.  ఒక్కోసారి నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. నడుస్తుండగానే తూలిపోతుంటారు. ఛాతీలో ఉబ్బరంగా అనిపిస్తుంది.

ఇవన్నీ కూడా గుండెనొప్పి కి సంకేతాలే………..
ఎవరికైనా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే జాగ్రత్తపడండి.శరీరంలో ఇలాంటి అసౌకర్యాలు కలిగిన వెంటనే రేపూ మాపూ అని వాయిదా వేయకుండా
డాక్టర్లను సంప్రదించండి.

జగన్నాధం✍

Leave a Reply