పుష్కరుడికి ఘన స్వాగతం..

   heartily welcome pushkaralu

తెలుగు రాష్ట్రాల్లో కృష్ణానది పుష్కరాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువ జాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చి కృష్ణానదిలో పుష్కరస్నానమాచరిస్తున్నారు.విజయవాడలోని దుర్గాఘాట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు పుష్కరస్నానం ఆచరించారు. అనంతరం కృష్ణమ్మకు చీర,సారె, పసుపు, కుంకుమ సమర్పించారు. మంత్రులు చిన రాజప్ప, కొల్లు రవీంద్ర తదితరలు పుష్కరస్నానమారించారు. అనంతరం సీఎం దంపతులు గోపూజ చేశారు.

కృష్ణా పుష్కరాలు శుక్రవారం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో పుష్కర శోభ సంతరించుకుంది. . అలాగే తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లా గొందిమళ్లలో సీఎం కేసీఆర్ దంపతులు పుణ్యస్నానం ఆచరించారు. ఆ తర్వాత కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమరావతి, శ్రీశైలం, విజయవాడతోపాటు మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లోని పుష్కర ఘాట్ల వద్ద పుష్కరస్నానం ఆచరించేందుకు భక్తులు ఉదయాన్నే అధిక సంఖ్యలో చేరుకున్నారు. భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. నల్గొండ జిల్లా మట్టపల్లి ఘాట్‌లో తెలంగాణ విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పుష్కర స్నానమాచరించారు.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో 57, నల్గొండ జిల్లాలో 28 పుష్కరఘాట్లు ఏర్పాటు చేశారు. ఘాట్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రతకోసం 13,474 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నారు. పుష్కరఘాట్ల వద్ద 555 సీసీ కెమెరాలతో రెప్పవాల్చని నిఘా ఏర్పాటు చేశారు.కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఆలయం నుంచి పాతళగంగ వరకు శోభాయాత్ర నిర్వహించారు. భ్రమరాంబికా ఘాట్‌లో జిల్లా కలెక్టర్‌, ఆలయ ఈవో కృష్ణమ్మకు సారె, చీర, పసుపు సమర్పించారు.

SHARE