పిక్ టాక్ : ‘నాన్న నేను నా బాయ్‌ ఫ్రెండ్స్‌’

 Posted October 26, 2016

hebah patel nenu naa boy friend movie first look

‘కుమార్ 21ఎఫ్’ బోలెడంత పాపులారిటీని సొంతం చేసుకొంది హెబ్బా పటేల్.హాట్ హాట్ గా కనిపిస్తూనే నటనలో ఇరగదీసింది.అది యూత్ కి తెగ నచ్చేసింది.‘కుమార్ 21ఎఫ్’ తర్వాత ఆ రేంజ్ లో హెబ్బా కనబడలేదు.అయితే,ఆమె తాజా చిత్రం’నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’.ఇందులో మరోసారి యూత్ ని మాయచేసేలా కనిపిస్తోంది.

హెబ్బా ప‌టేల్‌, తేజ‌స్వి మ‌డివాడ‌, అశ్విన్ బాబు, పార్వ‌తీశం,రావు ర‌మేష్‌,నోయెల్ సేన్‌..ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘నాన్న నేను నా బాయ్‌ ఫ్రెండ్స్‌’. భాస్క‌ర్ బండి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.ఈ చిత్రం మొత్తం రైట్స్ ని దిల్ రాజు సొంతం చేసుకొన్నాడు.దీంతో..ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి

తాజాగా, ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం. వెనకాల పెళ్లి బస్సు. ముందు సైకిల్ మోటార్ పై హెబ్బా, ప్రక్కనే ఆమె నాన్న రావు రమేష్.. కుడివైపు ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ తో భలే డిజైన్ చేశారు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని. ఈ పోస్టర్ యూత్ లో ఆసక్తిని కలిగిస్తోంది. యూత్ ఫుల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్  ప్రేక్షకులని తప్పుకుండా నచ్చుతుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రానికి సంగీతం శేఖ‌ర్ చంద్ర. బెక్కెం వేణుగోపాల్ (గోపి) నిర్మాత.

SHARE