Posted [relativedate]
గురుగ్రామ్ లోని దుందేహేరా ప్రాంతానికి చెందిన వినోద్ తండ్రి బాబులాల్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి. తన పెద్ద కుమారుడైన వినోద్ పెళ్లిని అందరికీ గుర్తుండేలా వినూత్నంగా చేయాలని అనుకున్నారు. కోడలి వద్దకు హెలికాప్టరును పల్లకిగా పంపించి ఇంటికి రప్పించారు.గురగ్రామ్ నగరంలో వినోద్ వాట్స్ (25) వధువు లలితను తన ఇంటికి తీసుకువచ్చేందుకు ఓ ప్రైవేటు హెలికాప్టరు పంపించారు. హెలికాప్టరు ఎగిరేందుకు, ల్యాండ్ అయ్యేందుకు వీలుగా అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నారు. ఈ హెలికాప్టరుకు అద్దె కింద రూ.2లక్షలు చెక్కు ద్వారా చెల్లించామని చెప్పారు.