ముద్రగడకి మద్దతుగా హేమ ..

0
275
hema supporting mudragada

hema supporting mudragada
రిజర్వేషన్ ఉద్యమంలో కాపుల నిరాసక్తత పట్ల అసహనం వ్యక్తం చేసిన కొద్ది రోజులకే ముద్రగడకి ఊహించని మద్దతు లభించింది.సినీ రంగానికి చెందిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ తనంత తానుగా ఉద్యమానికి మద్దతు ప్రకటించడమే కాదు …స్వయంగా కాకినాడలో జరిగిన కాపు మహిళా సదస్సుకి హాజరయ్యారు. ఈ సభా వేదిక నుంచి ఆమె చంద్రబాబు సర్కార్ ని తప్పుబట్టారు.ఎన్నికల ముందు కాపులకి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని హేమ డిమాండ్ చేశారు.ఇతర కులాల నుంచి అభ్యంతరాలు వస్తాయన్న వాదనను ఆమె ఖండించారు.అదే నిజమైతే కాపు రిజర్వేషన్ హామీ ఇచ్చిన టీడీపీ నుంచి ఇతర కులాల వారు పోటీ చేసి గెలిచారుగా అని ఆమె ఎదురు ప్రశ్నించారు.

actress-hema-met-mudragada-padmanabham-at-his-house
ముద్రగడకి ఉడతాభక్తిగా సాయం చేసేందుకే తాము ముందుకు వస్తున్నట్టు హేమ వివరించారు.ఇలా ఉద్యమాల్లో పాల్గొంటే చిత్రసీమలో తొక్కేస్తారన్న భయం తనకు లేదని ఆమె తేల్చేశారు.ఇంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని జైసమైక్యాంధ్ర పార్టీ తరపున 2014 ఎన్నికల్లో పోటీ చేసిన హేమ ఈ మధ్య తరచుగా రాజకీయ సంబంధ కార్యక్రమాలపై ఆసక్తి చూపుతున్నారు. ముద్రగడ వచ్చినపుడు దాసరి ఇంట్లో జరిగిన సమావేశానికి కూడా ఆమె వెళ్లారు .సినీ రంగంలో అవకాశాలు తగ్గడం వల్లే ఆమె రాజకీయ రంగానికి షిఫ్ట్ అయ్యే ఆలోచన చేస్తున్నట్టు ఫిలిం నగర్ టాక్ .

Leave a Reply