ఆమె విలన్ గా మారిందా..!

Posted November 8, 2016

hm11ఇప్పుడున్న లేడీ ఆర్టిస్ట్ లలో హేమ కచ్చితంగా ఎలాంటి పాత్రనైనా చేస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా అవతల వారి మీద సెటైర్స్ వేస్తూ హేమ బాగా ఆకట్టుకుంటుంది. ఈమధ్య తల్లి పాత్రలు చేస్తూ తన జోష్ తగ్గించినట్టు కనిపించినా ప్రస్తుతం చేస్తున్న సినిమాలో విలన్ గా కొత్త టర్న్ తీసుకుంటుందట హేమ.

ఏంటి హేమ విలన్ గానా.. అంటే అవును హేమనే విలన్ గానే చేసింది అంటున్నారు. సప్తగిరి హీరోగా చేసిన సినిమా సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఆ సినిమాలో హేమ ఓ కీ రోల్ చేసింది. అయితే అది విలన్ పాత్ర అని తెలుస్తుంది. మరి ఇన్నాళ్లు పాజిటివ్ రోల్స్ తో అలరించిన హేమ విలన్ గా ఎలా చేసిందో చూడాలి. త్రివిక్రం మార్క్ సెటైర్స్ తో అందరిని ఆటపట్టించే హేమను విలన్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందో కాని కెరియర్ కాస్త చప్పగా ఉన్న సమయంలో హేమకు ఈ విలన్ గా తీసుకున్న టర్న్ కాస్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. అరుణ్ పవార్ డైరెక్ట్ చేసిన సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఆడియోకి పవర్ స్టార్ పవన్ కళ్యాన్ వచ్చి టీం అందరికి తన బెస్ట్ విశెష్ తెలిపాడు.

SHARE