Posted [relativedate]
తెలుగు ఆడియెన్స్ ఇక మీసాలు తిప్పేయండి అంటున్నాడు హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇంతకీ ఈ కుర్ర హీరో అన్న మాటల్లోని ఆంతర్యం ఏంటో ఇప్పటికే మీకు అర్ధమయి ఉండొచ్చు. కొద్ది గంటల క్రితం రిలీజ్ ఆయిన నందమూరి బాలకృష్ణ వందవ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ట్రైలర్ చూసి ఇండస్ట్రీ అంతా ఆ ట్రైలర్ కు ఫిదా అయిపోయింది. బాలయ్య బాబు నటన క్రిష్ దర్శకత్వ ప్రతిభ కలిసి సినిమా ఓ అద్భుత కళాఖండంగా కనిపిస్తుంది.
ట్రైలర్ లోనే సినిమా అంతా చూపించేసిన క్రిష్ ఇక సినిమా ఎలా తీశాడో అన్న ఎక్సయిట్మెంట్ ప్రతి ఒక్కరికి కలిగించేలా చేశాడు. శాతవాహన చక్రవర్తి చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉందని చెప్పొచ్చు. ఇక సినిమాలోని డైలాగ్ తో నిఖిల్ ఈ ట్రైలర్ తో తనకు కలిగిన అనుభూతిని పంచుకున్నాడు. సినిమాతో తెలుగు ఆడియెన్స్ మరోసారి మీసం తిప్పేయొచ్చని ట్వీట్ చేశాడు నిఖిల్.
ఈమధ్యనే ఎక్కడికి పోతావు చిన్నవాడా అంటూ వచ్చి కెరియర్ లో ఓ మంచి సూపర్ హిట్ దక్కించుకున్న నిఖిల్ ఆ జోష్ లోనే ఇప్పుడు రెండు మూడు సినిమాలకు సైన్ చేసి ఉన్నాడు. త్వరలోనే అవి సెట్స్ మీదకు వెళ్లనున్నాయి.