ఇద్దరు మంత్రుల ఇంటి నుంచి ఓ పోలీస్..

0
524
hero police in ministers house

     Posted [relativedate]    

hero police in ministers house
ఓ మంత్రి కొడుకు పోలీస్ అయితే ఎలా ఉంటుంది? ఓ మంత్రి అల్లుడు పోలీస్ అయితే ఎలా ఉంటుంది? …రాజకీయాల్లో ఇప్పుడున్న వ్యవహారాలకు సెట్ అయ్యే మాట చెప్పండి ..ఇవన్నీ సినిమాల్లో మాత్రమే సాధ్యం అనుకుంటున్నారా? మీరనుకున్నది నిజంగా నిజం.ఏపీ క్యాబినెట్ లో వుంటూ వియ్యంకులైపోయిన గంటా శ్రీనివాసరావు,నారాయణ ల ఇంటి నుంచి వస్తున్న ఓ హీరో పోలీస్ వేషం వేయబోతున్నాడు.అతనే గంటా కొడుకు,నారాయణ అల్లుడు రవి.

సహజంగా సినిమాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎవరైనా ఓ ప్రేమకథని ఎంచుకోవడం చూస్తుంటాం.జయంత్ సి.పరాంజీ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా కూడా మొదట్లో ఓ ప్రేమ కథ అనుకున్నారు.అయితే ఆ ఆలోచనలు మారిపోయాయి.మూస విధానాలకు భిన్నమైన చేస్తే బాగుంటుందని నమ్మడమే కాకుండా సేతుపతి పేరుతో తమిళ్ లో హిట్ అయిన ఓ సినిమా రైట్స్ కొన్నారు.ఆ సినిమాని ఉన్నదున్నట్టు కాకుండా దాని ఆత్మ మిస్ కాకుండా తెలుగు ప్రేక్షకులకి తగ్గట్టు తీస్తున్నారు.అలా ఇద్దరు మంత్రుల ఇంటి నుంచి ఓ పోలీస్ వచ్చేస్తున్నాడు.

Leave a Reply