టాకీస్-2లో నిఖిషా అందాలు

nks1316బుల్లితెర రష్మిని సువర్ణగా సెగలు పుట్టించేలా చేసిన ప్రవీణ్ సత్తారు తీసిన గుంటూర్ టాకీస్ తో బడ్జెట్ కు రెండితలు లాభం వచ్చేలా చేశాడు. అయితే ఆ సినిమా తర్వాత తను రూట్ మార్చి యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ తో ఓ పవర్ ఫుల్ పోలీస్ సినిమా చేస్తున్నాడు. కాని గుంటూర్ టాకీస్ నిర్మాతలు మాత్రం టాకీస్ సీక్వల్ గా మరో భాగం తీస్తున్నారట. ఇక ఈ సీక్వల్ లో కూడా రష్మిని తీసుకుందాం అనుకుంటే ఆమె రెమ్యునరేషన్ చుక్కలు చూపిస్తుందట.

అందుకే ఈసారి గుంటూర్ టాకీస్ లో నికిషా పటేల్ ను సువర్ణగా తీసుకున్నారణి టాక్. సినిమాలో సన్ని లియోన్ కూడా ఉంటుందని అన్నారు. అయితే సన్ని రోల్ ప్రత్యేకంగా ఉంటుందట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో స్టార్ట్ అవనుంది. మరి గుంటూర్ టాకీస్ మొదటి భాగం శృంగార ప్రియులను ఆకట్టుకోగా దానికి సీక్వల్ గా మరింత డోస్ పెంచి రాబోతున్న ఈ టాకీస్-2 ఇంకెంత ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి. ప్రస్తుతం తెలుగులో అవకాశాలేమి లేకపోవడంతో నిఖిషా పటేల్ ఈ ఛాన్స్ తో మరోసారి తన అందంతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది.

SHARE