ట్రంప్ పై ఇలియానా హాట్ కామెంట్స్

Posted October 15, 2016

 heroine ileana comment on trump

ముద్దుగుమ్మ ఇలియానా చాలా ఓపెన్. బ్రా నుండి బాయ్ ఫ్రెండ్ దాకా ఏం దాచుకోకుండా మాట్లాడేస్తుంది. బాలీవుడ్ లో అడుగుపెట్టాక నోటి దురుసు ఇంకాస్త పెరిగింది. తాజాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పైనా తనదైన శైలిలో కామెంట్ చేసింది.

బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రెటీల్ని ట్రంప్ కు మద్దతుగా పెర్ఫామ్ చేసేందుకు రిపబ్లికన్ పార్టీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. (అక్టోబర్ 15)న అమెరికాలోని న్యూ జెర్సీలో ”హ్యుమానిటీ యునైటెడ్ ఎగైనస్ట్ టెర్రర్” అనే ఈవెంటులో బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ పాల్గొనాల్సి ఉంది. ఈ ఈవెంట్ కోసం ఇలియానికి ఆహ్వానం అదిందింది. అయితే, తాను ట్రంప్ కి మద్దతు ఇవ్వబోనని తేల్చి చెప్పింది ఇల్లీ భామ. అక్కడితో ఆగకుండా.. మహిళల కించపరిచేలా వాఖ్యలు చేసే ట్రంప్ కి సపోర్ట్ చేయలేనంది.

ఇది విన్న బాలీవుడ్ జనాలు ట్రంప్ కే నోటి దురద ఎక్కువనుకుంటే.. ఇలియానాకి ఆ దురద ఇంకాస్త ఎక్కువనున్నట్టుందని కామెంట్స్ చేస్తున్నారు.

SHARE