పాపం.. అన్ని కష్టాలు అఖిల్‌కే

0
764
heroine need for akhil second movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

heroine need for akhil second movieఅక్కినేని కుటుంబం నుండి ‘అఖిల్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అఖిల్‌కు బ్యాడ్‌ టైం బీభత్సంగా నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది. మొదటి సినిమా అట్టర్‌ ఫ్లాప్‌, రెండవ సినిమా దాదాపు రెండు సంవత్సరాలకు కుదిరింది. ఇక మద్యలో ప్రేమ పెళ్లి పెటాకులైంది. వివాహ నిశ్చితార్థం అయిన తర్వాత పెళ్లి క్యాన్సిల్‌ అయ్యింది. దాంతో అఖిల్‌ పూర్తిగా సినిమాలపై దృష్టి పెడతాడని అంతా భావించారు. కాని అఖిల్‌ రెండవ సినిమా కూడా ఇప్పుడు చిక్కుల్లో పడ్డట్లయ్యింది.

అఖిల్‌ రెండవ సినిమాను విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో నాగార్జున దాదాపు 50 కోట్ల బడ్జెట్‌తో సినిమాను మొదలు పెట్టాడు. విక్రమ్‌ కుమార్‌పై నమ్మకంతో తన తనయుడి బాధ్యతలు ఆయన చేతిలో పెట్టాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్‌ పూర్తి అయ్యింది. రెండవ షెడ్యూల్‌ ప్రారంభం అవ్వాల్సి ఉంది. అయితే హీరోయిన్‌ ఎంపిక ఇంకా కానందున సినిమా షెడ్యూల్‌ను క్యాన్సిల్‌ చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఒక బాలీవుడ్‌ మోడల్‌ను ఎంపిక చేసిన తర్వాత ఆమె నో చెప్పిందని, ప్రస్తుతం మరో హీరోయిన్‌ కోసం దర్శకుడు అన్వేషిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు ‘జున్ను’ అనే విభిన్నమైన టైటిల్‌ను అనుకుంటున్నారు. ఈ సంవత్సరంలో రెండవ సినిమాతో రావాలని ఆశిస్తున్న అఖిల్‌ కోరిక నెరవేరేలా లేదు.

Leave a Reply