సునీల్ పై చిన్నచూపు ఎందుకో..!

Posted November 27, 2016, 10:27 pm

Image result for comedian sunil

కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్ హిట్ కోసం నానా తిప్పలు పడుతున్నాడు. గత రెండు మూడు సంవత్సరాలుగా సునీల్ కు ఒక్కటంటే ఒక్క హిట్టు లేదంటే నమ్మాల్సిందే. అయితే ఈ క్రమంలో తనకున్న క్రేజ్ కూడా తగ్గేట్టు చేసుకున్నాడు సునీల్. ఇక ప్రస్తుతం తన సినిమా అంటే హీరోయిన్స్ సారీ చెప్పే పరిస్థితి వచ్చింది. ఏమాత్రం ఛాన్స్ ఉన్నా హీరోయిన్ గా అవకాశం కొట్టేయాలని చూసే ఈరోజుల్లో సునీల్ సినిమా పిలిచి అవకాశం ఇస్తామన్నా ఛీ అనేస్తున్నారట.

సునీల్ సినిమా చేసి ఫ్లాప్ మూటకట్టుకోవడం కన్నా సైలెంట్ గా ఉండటం బెటర్ అని వాళ్ల నమ్మకం. ప్రస్తుతం సునీల్ మలయాళ సూపర్ హిట్ సినిమా టూ కంట్రీస్ రీమేక్ లో నటిస్తున్నాడు. ఎన్. శంకర్ డైరెక్ట్ చేయబోయే ఈ సినిమా హీరోయిన్ కోసం వెతకుతున్నారట చిత్రయూనిట్. సునీల్ సినిమా అనగానే కాస్త ఆలోచిస్తున్నారట. ఓ పక్క సునీల్ క్రాంతి మాధవ్ డైరక్షన్లో కూడా మూవీ చేస్తున్నాడు. ఆ సినిమాలో కూడా తెలుగు హీరోయిన్స్ ఎవరు ఓకే చెప్పకపోతే తమిళ హీరోయిన్ మియా జర్జిని పెట్టి తీస్తున్నారు. మరి సునీల్ ఈ రెండు సినిమాలైనా సరే హిట్ కొట్టి తన సత్తా చాటాలని కోరుకుందాం.