Sunday, October 17, 2021
Homelatestఆ ఆఫర్ తో రాములమ్మ ముగ్గులోకి దిగిందా?

ఆ ఆఫర్ తో రాములమ్మ ముగ్గులోకి దిగిందా?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు రాజకీయాల్లో గుర్తింపు కోల్పోయిన రాములమ్మకు ఇప్పుడు కష్టాల్లో వున్న చిన్నమ్మ హారతులతో స్వాగతం పలుకుతోంది. తమిళనాట మహామహులైన నేతలు,నమ్మిన బంటులు ఎందరు వున్నా చిన్నమ్మ మాత్రం రాములమ్మని జైలుకి పిలిపించుకుని మరీ మాట్లాడింది.ఇక జైలు నుంచి బయటపడ్డ దినకరన్ అయితే తన చుట్టూ పాతికమంది ఎమ్మెల్యేలున్నా పట్టించుకోకుండా ఎదురొచ్చి మరీ రాములమ్మకు స్వాగతం పలికారు.రాములమ్మకు శశికళ అండ్ కో ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడాన్ని తేలిగ్గా అర్ధం చేసుకోవచ్చు.వాళ్ళ అవసరం అలాంటిది.నడి సంద్రంలో కొట్టుకుపోతున్నప్పుడు చిన్న పుల్ల కనిపించినా దాన్ని పట్టుకు ఒడ్డుకి చేరడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు శశికళ రాములమ్మ విషయంలో చేస్తోంది అదే.పళనిస్వామి,పన్నీర్ సెల్వం వర్గాలు కలిసిపోకముందే సర్కార్ ని పడగొట్టేందుకు శశి టీం ప్లాన్ చేస్తోంది.అప్పుడు వచ్చే ఎన్నికల్లో తమ వర్గం తరపున ఓ స్టార్ కాంపైనర్ కావాలి కాబట్టి రాములమ్మని చిన్నమ్మ వర్గం ఇంతలా గౌరవిస్తోంది . కానీ అటు తాను ఓడిపోతున్న టీం లోకి వెళుతున్న విషయం తెలిసి కూడా రాములమ్మ ఎందుకు ధైర్యం చేస్తుందన్నది ప్రశ్న. ఇంతకీ ఏ ఆఫర్ తో రాములమ్మ తమిళ రాజకీయాల ముగ్గులోకి దిగారు? ఈ ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు వెలుగుజూస్తున్నాయి.

విజయశాంతి ఆర్ధిక,రాజకీయ పరిస్థితిని చిన్నమ్మ క్యాంపు బాగా అర్ధం చేసుకుంది.పైగా జయ మీద అభిమానం ,తమతో మంచి సంబంధాలతో పాటు అంతోఇంతో ప్రజాకర్షణ వున్న నేతల కోసం చిన్నమ్మ ట్రై చేస్తున్నప్పుడు విజయశాంతి వారికి గుర్తొచ్చింది.జయ మరణించినప్పుడు శశిని పరామర్శించినవారిలో విజయశాంతి,శ్రీదేవి ప్రత్యేక అభిమానం చూపిన విషయం చిన్నమ్మకి తెలుసు. శ్రీదేవి కి రాజకీయాలు పడవు కాబట్టి ఇక మిగిలింది విజయశాంతి.అందుకే ఆమెకి భారీ ఆఫర్ ఇచ్చి అన్నాడీఎంకే రాజకీయాల్లో అడుగుపెట్టే ప్రయత్నాలు చేశారు.ఆమెకి అన్ని విధాలుగా ఆర్ధిక సహకారం అందించడంతో పాటు పార్టీ ఓడినా,గెలిచినా రాబోయే రోజుల్లోఉన్నకొద్దిమంది ఎమ్మెల్యేలతో అయినా రాజ్యసభకు పంపిస్తామని హామీ ఇచ్చారట.ఈ ఆఫర్ కి తలొగ్గే విజయశాంతి ఇన్ని ఇబ్బందులు పడుతున్న శశి అండ్ టీం తో కలిసి పనిచేయడానికి ఒప్పుకున్నారట.

- Advertisment -
spot_img

Most Popular