సమంతాను ఇప్పటివరకూ పద్ధతైన దుస్తుల్లోనే చూశాం. సినిమాల్లోనూ.. బయటా అమ్మడు నిండైన వలువల్లోనే దర్శనమిచ్చింది. అందాల సామ్ ఎప్పుడూ ఇలానే ఉంటుందనుకోడానికి లేకుండా.. అమ్మడి బోల్డ్ లుక్ సోషల్ మీడియాలో తేలింది. ఫ్యాషన్ డిజైనర్ నీరజ, రెజీనా, రకుల్‌లతో కొన్ని రోజుల క్రితం సమంతా ఫారిన్ టూర్లో సందడి చేసింది. అప్పట్లో వాటికి సంబంధించిన ఫొటోలు ట్విట్టర్లో పెట్టి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది.
తాజాగా సమంతా బ్లాక్ డ్రస్‌లో ఉన్న ఫొటో బయటకొచ్చింది. ఈ సొగసరి ఇలాంటి అవుట్‌ఫిట్‌లో ఏదోనాడు ప్రత్యక్షమవుతుందని తెలుగు జనాలెవరూ ఊహించి ఉండరు. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. చిట్టిపొట్టి డ్రస్సుల్లోనూ సమంతా చాలా బాగుంది. వెండితెరపై ఒద్దికగా కనిపించే సామ్ బయట ఇలా రెచ్చిపోయి కనిపించడం అభిమానులను ఆశ్చర్యంలో పడేసింది.