రాజమౌళి టు రామ్..సంపూర్ణేష్ టు పవన్

Posted January 26, 2017

heros and directors tweets to support vizag beach rally
ఏపీ కి ప్రత్యేక హోదా డిమాండ్ తో విశాఖ ఆర్కే బీచ్ వద్ద యువత తలపెట్టిన మౌన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోడానికి పోలీసులు,ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేస్తోంది.అయితే ఆ నిర్బంధాన్ని లెక్కచేయకుండా కార్యక్రమాన్ని నిర్వహించడానికి యువత కూడా ట్రై చేస్తోంది.ఈ పరిస్థితుల్లో టాలీవుడ్ నుంచి అగ్ర హీరోలు అనుకున్న చాలా మంది మౌన నిరసనపై మౌనంగా ఉండిపోయారు. జనసేన అధినేతగా పవన్ అందుకు మినహాయింపు .పవన్ తో పాటు మెగా క్యాంపు లోని సాయి ధరమ్ తేజ్,వరుణ్ తేజ్,నాగబాబు ఇప్పటికే హోదా పోరాటానికి అండగా నిలవగా …ఇంతకుముందే మద్దతు ప్రకటించిన తెలంగాణ కి చెందిన సంపూర్ణేష్ ఏకంగా వైజాగ్ లో దిగిపోయారు.ఇంతకు ముందు వివాదాస్పద అంశాల్ని ఎప్పుడూ టచ్ చేయని రాజమౌళి కూడా హోదా డిమాండ్ కి మద్దతు పలికారు.యువ హీరో రామ్ ,నాని,సందీప్ కిషన్ సైతం యువతకి అండగా నిలిచారు.

ప్రజలకి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన జనసేనాధిపతి విశాఖ నిరసనకు మరోసారి అండగా నిలిచారు.భవిష్యత్ లో నీచ రాజకీయాలు చేయాలంటే భయపడాలి అన్న స్థాయిలో మాట్లాడారు.పవన్ పోరాటాన్ని అభినందించిన వర్మ…ఈ అంశంలో మహేష్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.మొత్తానికి వెండితెరపై హీరోయిజాన్ని తెగ చూపించేవారి కన్నా మిగిలిన నటులే కొద్దిగా స్పందిస్తున్నారు.తాజాగా టాలీవుడ్ నుంచి పలువురు హీరోలు,దర్శకులు చేసిన ట్వీట్స్ ఇవే …

Pawan kalyan tweet about special status

 

rajamouli tweet about special status

ram tweet about special statusram gopal varma tweet about special status

sandeep kishan participated for ap special status

varun tej support to ap special status

sai dharam tej support to ap special status

SHARE