ఆర్కే ఖాకీల దగ్గరున్నాడా? హై కోర్ట్ ప్రశ్న..

 Posted October 31, 2016

high court asked to ap police is rk dead or aliveమావోయిస్టుల అగ్రనేత ఆర్కేకు ఎలాంటి హాని తలపెట్టొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తన భర్త ఆచూకీ తెలపాలంటూ ఆర్కే భార్య శిరీష అలియాస్ పద్మక్క హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు ఓ వ్యక్తి సామాన్యుడైనా, మావోయిస్టు అయినా ప్రాణాలు విలువైనవని, ఆర్కే విషయంలో గందరగోళం ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్కే చనిపోయాడా..? పోలీసుల అదుపులో ఉన్నాడా అని ఏపీ ప్రభుత్వ లాయర్‌ను ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.

SHARE