ముద్రగడ యాత్రకి హై కోర్ట్ గ్రీన్ సిగ్నల్….

Posted November 15, 2016

High Court Green Signal to Mudragada Kapu Satyagraha Yatraకాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం తలపెట్టిన సత్యాగ్రహ పాదయాత్రకు హైకోర్టు అంగీకారం తెలిపింది. ఆయన యాత్ర చేసినంత మాత్రాన శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని, ఒకవేళ ఏదైనా శాంతిభద్రతల సమస్యలు వస్తే పోలీసులు చూసుకోవాలని స్పష్టం చేసింది. ముద్రగడ నేతృత్వంలో కోనసీమలో చేపట్టనున్న సత్యాగ్రహ పాదయాత్ర తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోలేదంటూ ఓ పక్క చెబుతూనే.. మరో పక్క భారీగా పోలీసులను మోహరిస్తున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా యాత్రను అడ్డుకోవాలని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసినా, కోర్టు కూడా ఆయనకు సానుకూలంగా ఉత్తర్వులు వెలువరించింది. దాంతో ఆయన యాత్రపై ఉత్కంఠ నెలకొంది. కాపులను బీసీల్లో చేర్చాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ నెల 16 నుంచి 21 వరకూ ముద్రగడ ఆధ్వర్యంలో కాపు ఉద్యమకారులు సత్యాగ్రహ పాదయాత్ర చేపడుతున్నారు.

[wpdevart_youtube]-eVEGIVmbRs[/wpdevart_youtube]

SHARE