ఆ మాజీ ఎమ్మెల్యే జీతం వెనక్కి ఇవ్వాలి…

0
314
high court said ex mla satrucharla vijayaramaraju salary given back

 Posted [relativedate]

high court said ex mla satrucharla vijayaramaraju salary given back

తెలుగుదేశం నేత,మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పొందిన జీతాన్ని తిరిగి చెల్లించాలని హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది.శత్రుచర్ల ఎస్.టి.కాదని కోర్టు దృవీకరించిన నేపధ్యంలో హైకోర్టు ఈ ఆదేశం జారీ చేసింది.శత్రుచర్ల క్షత్రియ వర్గానికి చెందినవారని, అయినా ఎస్.టి.లకు చెందిన నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారని, అందువల్ల , ఆ కాలంలో ప్రభుత్వం చెల్లించిన వేతనాన్ని తిరిగి వసూలు చేయాలని హైకోర్టులో నిమ్మక జయరాజ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది.దానిపై హైదరాబాద్ కోర్టు విచారణ చేసి శత్రుచర్ల ఎమ్మెల్యేగా పొందిన జీతాన్ని వసూలు చేయాలని తీర్పు ఇచ్చింది..దేశ రాజకీయాలలో ఇది ఒక విన్నూత్న తీర్పు అని అంటున్నారు.1999,2004 లలో ఎస్.టి. సీటులోను, ఆ తర్వాత జనరల్ సీటులోను శత్రుచర్ల కాంగ్రెస్ పక్షాన పోటీచేసి గెలుపొందారు.గత ఎన్నికలలో శత్రుచర్ల తెలుగుదేశం పక్షాన పోటీచేసి ఓడిపోయారు.

Leave a Reply