ట్రిపుల్ తలాఖ్ నహి హోసక్తా..హైకోర్టు

0
504
triple-talaq-is-unconstitutional-says-allahabad-high-court

Posted [relativedate]

triple-talaq-is-unconstitutional-says-allahabad-high-courtఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం పాటించే ‘ట్రిపుల్ తలాక్’ రాజ్యాంగ విరుద్ధమని అలాహాబాద్ హై కోర్ట్ తీర్పునిచ్చింది .మహిళా హక్కుల కోసం పోరాడేవారికి మరింత ఉత్సాహం నింపేలా ఈ తీర్పు ఉందని పలువురు అంటున్నారు ఇస్లాం పద్దతి లో .విడాకులు ఇచ్చేందుకు మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులిచ్చేశామని చెప్పడం ముస్లిం మహిళల హక్కులను కాలరాయడమేనని రాజ్యాంగాన్ని మించిన పర్సనల్ లా బోర్డులు లేవని తీర్పు లో స్పష్టం చేసింది .

ట్రిపుల్ తలాక్ విధానం చెల్లుబాటును సవాల్ చేస్తూ పలువురు మహిళా హక్కుల కార్యకర్తలు, ఎన్‌జీవోలు సుప్రీమ్ కోర్ట్ లో పిటిషన్ వేశారు .ఈ పిటిషన్‌పై ఇటీవల సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ట్రిపుల్ తలాఖ్ విధానాన్ని రద్దు చేయాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుండడంతో… తొలిసారి ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా కేంద్రం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించింది. స్త్రీ, పురుష సమానత్వానికి ఈ పద్ధతి వ్యతిరేకమని అంటోంది .ఏఐఎంపీఎల్‌బీ మాత్రం కేంద్రం వాదనను, వైఖరిని వ్యతిరేకిస్తోంది.

Leave a Reply