బాబు సర్కార్ కి హైకోర్టు షాక్ ..

0
353
high court shocked to chandrababu sarkar

 Posted [relativedate]

high court shocked to chandrababu sarkar
చంద్రబాబు సర్కారుకి హైకోర్టు షాక్ ఇచ్చింది.ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ గా కారెం శివాజీ ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది.ఆయన్ను ఆ పదవికి ఎంపిక చేసిన విధానం సరిగ్గా లేదని స్పష్టం చేసింది.ఇలాంటి కమిషన్ చైర్మన్ పదవి కోసం నోటిఫికేషన్ ఇవ్వడం ,ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం వంటి ప్రక్రియ వుండాలని హైకోర్టు సూచించింది.అర్హతల విషయంలోనూ నిబంధనలేమీ లేకపోవడాన్ని కోర్టు ఎత్తి చూపింది.కారెం శివాజీ వాదనల్ని కూడా కోర్ట్ కొట్టివేసింది. మరో సమర్ధుడైన వ్యక్తిని ఆ పదవిలో నియమించాలని స్పష్టం చేసిన కోర్ట్ అప్పీల్ కి కూడా నిరాకరించింది.

high court shocked to sc st commission chairman karem sivaji postకోర్ట్ తీర్పుతో కారెం భవితవ్యం ప్రశ్నగా మిగిలింది.అంతకుముందు మాలమహానాడు అధ్యక్షుడిగా ఉంటూనే ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఉద్యమం తో పాపులారిటీ పెంచుకున్నారు కారెం.అనూహ్యంగా ఆయనకి ఈ పదవి ఆఫర్ చేసిన రాష్ట్ర సర్కార్ హోదా ఉద్యమం నుంచి ఆయన్ను తెలివిగా పక్కకు తప్పించింది.అయితే ఇప్పుడు వచ్చిన పదవి కూడా పోవడంతో కారెం ఏమి చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply