మరోసారి స్మాల్ స్క్రీన్ రికార్డ్ ఎన్టీఆర్ సొంతం..!

Posted November 7, 2016

tv1716స్టార్ సినిమా అంటే ఏయే విభాగాల్లో రికార్డులను సాధిస్తాడా అని అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఫస్ట్ టీజర్ యూట్యూబ్ వ్యూయర్ కౌంట్ దగ్గర నుండి ఫస్ట్ డే కలక్షన్స్ రికార్డ్ దాకా బిజినెస్ జరుగుతున్న విధానం చూసి ఫ్యాన్స్ సంబరపడిపోతారు. అయితే ఈ మధ్య టి.ఆర్.పి రేటింగ్స్ లో కూడా ఏ హీరో ఎంత రేటింగ్ సంపాదిస్తున్నాడని లెక్క కడుతున్నారు. లాస్ట్ ఇయర్ టెంపర్ మీదున్న హయ్యెస్ట్ టి.ఆర్.పి రేటింగ్ బాహుబలి వచ్చి క్రాస్ చేసింది.

ఇక రీసెంట్ గా జనతా గ్యారేజ్ తో మరోసారి బుల్లితెర మీద తన సత్తా చాటాడు యంగ్ టైగర్. లాస్ట్ మంత్ మా టివిలో ప్రసారం అయిన గ్యారేజ్ సినిమాకు 20.69 టి.ఆర్.పి రేటింగ్ వచ్చిందట. ఇప్పటి వరకు ఈ ఏడాది రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో ఇదే హయ్యెస్ట్ టి.ఆర్.పి రేటింగ్ పాయింట్స్. తమిళ డబ్బింగ్ మూవీ బిచ్చగాడు 18 పాయింట్స్ తో ఉండగా దాన్ని క్రాస్ చేసి ఎన్టీఆర్ స్మాల్ స్క్రీన్ పై తన స్టామినా ఏంటో చూపించాడు. ఎన్టీఆర్ కెరియర్ లో 20 ప్లస్ టి.ఆర్.పి వచ్చిన సినిమా ఇదే అని అంటున్నారు. బుల్లితెర మీద తారక్ తో ఢీ కొట్టేవారు లేరని చెప్పాలి.

SHARE