హిల్లరీదే తొలి గెలుపు..

Posted November 8, 2016

hillary won the first innings
ప్రపంచమంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి ఫలితం వెల్లడైంది.అందులో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ విజయం సాధించారు.న్యూ హాంప్షైర్ లోని డిక్స్ విల్లే నాచ్ లో 4-2 తేడాతో ట్రంప్ మీద హిల్లరీ గెలుపొందారు.భారత కాలమానం ప్రకారం ఈ మధ్యాహ్నం అమెరికా అధ్యక్ష్య ఎన్నికల పోలింగ్ పర్వం మొదలైంది.రేపు ఉదయం నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది.రేపు మధ్యాహ్నానికి పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం వుంది.

అయితే తొలి ఫలితం వచ్చిన డిక్స్ విల్లే నాచ్ లో మాత్రం మన కాలమానం ప్రకారం పోలింగ్ సోమవారం రాత్రి జరిగింది.అందుకే అక్కడి ఫలితం ముందుగా వెల్లడైంది.ఈ రిజల్ట్ తో డెమోక్రాటిక్ క్యాంపు లో ఉత్సాహం వెల్లివిరిసింది.ట్రంప్ శిబిరం కాస్త డీలా పడింది.

SHARE