హిమాలయాల్లో దాక్కున్న రుతుపవనాలు

0
449

himalayas hide monsoon
నైరుతి రుతు పవనాలు హిమాలయాల్లో కేంద్రీకృతమైనప్పుడు దక్షిణ భారతదేశానికి ముఖం చాటేయడం పరిపాటి. ప్రస్తుతం అదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో నైరుతి రుతు పవనాలు అంతగా ప్రభావం చూపిం చడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో కొద్ది పాటి జల్లులతోనే సరిపెడు తున్నాయి. అక్క డక్కడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల అసలు వర్షాలు పడటం లేదు.

భారతదేశంలో జూన్‌ నుంచి సెప్టెంబరు వరకూ నైరుతి సీజన్‌గా పేర్కొంటారు. ఈ సమ యంలో బంగాళాఖాతంలో 8 వాయు గుండాలు ఏర్పడేవని విశాఖ వాతావరణ కేంద్రం విశ్రాంత సంచాలకులు రాళ్లపల్లి మురళీకృష్ణ వివరించారు. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో 1980 నుండి నైరుతి రుతు పవనాలు క్రమంగా బలహీన పడుతున్నాయన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ బంగాళాఖాతంలో ఒక్క వాయుగుండమే ఏర్పడింది. దీని వల్ల రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో క్రమ పద్ధతిలో వర్షం కురవడం లేదు. వాయు గుండాలు, అల్పపీడనాల సమయంలో నైరుతి ప్రభావంతో భారీ వర్షాలు ఎటూ కురుస్తాయి.

అవి ఏర్పడనప్పుడు కూడా నైరుతి ప్రభావంతో జల్లులు గంటల కొద్దీ పడేవి. అలాంటిది కొన్నేళ్లుగా నిమి షాలకే వర్షం పరిమితమై పోతోంది. అల్పపీడనాలు, వాయు గుండాలు ఏర్పడినప్పుడు మాత్రమే నైరుతి పవనాలు ప్రభావం చూపతున్నాయి. దీనికి కారణం వాతావరణంలో కాలుష్యం, ఉష్ణోగ్రతలు పెరగడ మేనని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో నైరుతి అంతగా ప్రభావం చూపకపోయినా ఈ సీజన్‌ ముగిసే నాటికి అధిక వర్షపాతమే ఇస్తుందని రాళ్లపల్లి తెలిపారు. జూన్‌ చివరి రెండు వారాల్లో రాష్ట్రంలో మిగులు వర్షం పడిందని, జూలైలో మూడో వారం నడుస్తున్నా ఆశించిన స్థాయి వర్షపాతం ఇవ్వలేదన్నారు. ఈ నెల చివర్లో అల్పపీడనం లేదా వాయుగుండం ఏర్పడే అవకాశం ఉంటుందన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండాలు ఏర్పడితేనే తెలుగు రాష్ట్రాలకు తగినంత మేలు కలుగుతుందన్నారు. ఆగస్టు, సెప్టెంబరులో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదవుతాయన్నారు.

క్రమ పద్ధతి తప్పడం వల్ల రైతాంగానికి తగినంత మేలు జరగదన్నారు. ఛత్తీస్‌గఢ్‌ నుండి తెలంగాణ, కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో బుధవారం ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు అక్కడక్కడా ఓ మోస్తరు నుండి చెదురు మదురు జల్లులు కురుస్తాయన్నారు. మంగళవారం మచిలీ పట్నం, కాకినాడ, విజయనగరం జిల్లాల్లోని పలు చోట్ల వర్షాలు కురిసినట్లు తెలిపారు.

Leave a Reply