రేవంత్ కోసం కేటీఆర్ కుమారుడి రికమండేషన్!!

Posted March 28, 2017

himansh recommended revanth reddy
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సెషన్ మొత్తం సస్పెన్షన్ కు గురైన రేవంత్ రెడ్డికి… సీఎం కేసీఆర్ మనువడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు అండగా ఉన్నారట. రేవంత్ పై సస్పెన్షన్ ను ఎత్తేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు రికమండ్ చేశారట. స్వయంగా రేవంత్ రెడ్డే ఈ విషయం బయటకు చెప్పడంతో అందరూ నవ్వుకున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.

సస్పెన్షన్ వేటు పడడంతో.. రేవంత్ రెడ్డికి సభకు వచ్చే అవకాశం రావడం లేదు. సభా ప్రాంగణంలోకి కూడా ఆయనను అనుమతించడం లేదు. కానీ ఎలాగోలా ఈ మధ్య ఆయన అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చారు. ఇటీవల సభ నడుస్తున్న సమయంలో… ఎంపీ బాల్క సుమన్ కు… అసెంబ్లీ బయట రేవంత్ ఎదురుపడ్డారు. రేవంత్ ను పలకరించిన సుమన్.. సస్పెండ్ అయినా అసెంబ్లీ ప్రాంగణంలోకి ఎలా రానిచ్చారు? అని సెటైర్ వేశారు. దీనిపై స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ తనయుడు హిమాన్షు వాళ్ల తాత కేసీఆర్ కు చెప్పి… నన్ను లోపలికి వచ్చేలా రికమండ్ చేశాడని రికమండ్ చేశారంటూ రేవంత్ రెడ్డి చమత్కరించారు. మీ కంటే హిమాన్షయే బెటర్ సరదాగా వ్యాఖ్యానించారు.

అంతటితో ఊరుకోకుండా మరో పెద్ద డైలాగ్ కొట్టారు రేవంత్ రెడ్డి. మీకు హిమాన్షు. ..మాకు దేవాంశ్ అంటూ కామెంట్ నవ్వుతూ చెప్పారాయన. దీంతో అక్కడున్న ఎంపీ సుమన్ సహా అందరూ నవ్వుకున్నారు. ఎంతైనా రేవంత్ రెడ్డి మహా ఘటికుడే అంటూ .. టీఆర్ఎస్ నాయకులు అక్కడ్నుంచి వెళ్లిపోయారు.

SHARE