హోలీ వేళ పిడిగుద్దులు!!

0
247
holi fisticuffs in hunsa

Posted [relativedate]

holi fisticuffs in hunsa
హోలీ అంటే అందరూ రంగులు జల్లుకొని శుభాకాంక్షలు చెప్పుకోవడం కామన్. కానీ ఆ గ్రామంలో మాత్రం హోలీ అంటేనే బాక్సింగ్ ను తలపించే ఫైటింగ్ సీన్ జరుగుతుంది. గ్రామస్తులంతా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుప్పించుకుంటారు. ఈ ఫైటింగ్ హోలీ గురించి తెలుసుకోవాలంటే నిజామాబాద్ జిల్లాకు వెళ్లాల్సిందే.

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హున్సా గ్రామం. ఇక్కడ జరిగే హోలీ మామూలుగా ఉండదు. బాక్సింగ్ ను తలపించేలా పిడిగుద్దుల వర్షం కురుస్తుంది. రక్తాలు కారినా డోంట్ కేర్. ఆట సాగాల్సిందే. పండుగ జరగాల్సిందే.

పిడిగుద్దులాట బయట వారికి విచిత్రంగా కనిపించినా హున్సా గ్రామస్తులు మాత్రం ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఎంతో ఇష్టపడతారు కూడా. హోలీ పండుగ నాడు సాయంత్రం ఈ పిడిగుద్దులాట జరుగుతుంది. డప్పు వాయ్యిదాలతో గ్రామస్తులంతా హనుమాన్ మందిరం దగ్గరకు చేరుకుంటారు. ఆ తర్వాత ఫైటింగ్ మొదలవుతుంది. కులమతాలకతీతంగా జనం రెండు వర్గాలుగా విడిపోతారు. ఒక పెద్దతాడును మధ్యలో ఉంచి రెండు వైపులా మోహరిస్తారు. సుమారు 20 నిమిషాల పాటు అవతల ఉన్న వారిపై పిడిగుద్దుల వర్షం కురుస్తుంది. రక్తాలు కారుతున్నా ఆట కొనసాగుతుంది.

హున్సాలో 450 ఏళ్లుగా పిడిగుద్దులాట ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆటలో గాయాలైనా గ్రామస్తులు లైట్ తీసుకుంటారు. మందులు వాడకపోయినా మట్టిని రాస్తే… వాటంతట అవే తగ్గిపోతాయని వారి నమ్మకం. ఇంత పెద్దెత్తున ఫైటింగ్ జరిగినా గ్రామస్తుల మధ్య ఎలాంటి శత్రుత్వం ఉండదు. అందుకే ఆట పూర్తవ్వగానే ఒకరినొకరు ఆలింగనం చేసుకొని హోలీ శుభాకాంక్షలు చెప్పుకుంటారు.

హున్సాలో ఓ ఏడాది పిడిగుద్దులాటను ఆపేస్తే అరిష్టం జరిగిందట. అందుకే ఈ ఆటను మాత్రం ఆపేది లేదంటున్నారు గ్రామస్తులు. ఇక ముందు కూడా ఈ ఫైటింగ్ హోలీ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని చెబుతున్నారు.

Leave a Reply